ఇలా చేయండి హనుమను పట్టుకోవడం చాలా సులభం

మనలో చాలామందికి హనుమ అంటే చాలా ఇష్టం. ఆయన్ను పూజించాలని అనుకుంటారు. ఆయన్ను ఆరాధించాలని ప్రయత్నిస్తారు. ఆయన్ను ఉపాసించడానికి ఆరాటపడతారు. మరి మహాబలవంతుడైన హనుమంతుడిని పట్టుకోవడం సులభమా అంటే పురాణాలు సులభమనే చెబుతున్నాయి. హనుమంతుడి ప్రతిమనుగాని, హనుమా అని రాసిగాని అరటి తోటలో ఉంచి పూజించండి ఆయన తప్పకుండా కరుణిస్తాడు. ఇంకా చెప్పాలంటే పూజగదిలో హనుమంతుడి విగ్రహాం చుట్టూ అరటి చెట్లను కట్టి, విగ్రహం కింద అరటి ఆకులు పరిచి, నైవేద్యంగా మాగిన అరటిపండ్లను పెట్టి చూడండి… ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. అయితే, దీనికి కావలసింది శరణాగతితో కూడిన పూజ.

స్వామి నీవు ఉన్నావయ్యా…తప్పకుండా వస్తావయ్యా…నేను సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరిస్తావయ్యా అని నమ్మి పూనికతో పూజించండి… హనుమ తప్పకుండా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. మన కంటికి కనిపించే రూపంతో కాకపోయినా ఏదోఒక ప్రాణి రూపంలో ఆయన వస్తాడు. హనుమంతుడికి అరటి చెట్లన్నా, అరటిపండ్లన్నా చాలా ఇష్టం. అందుకే కోతులకు అరటిపండ్లను పెడుతుంటారు. ఏ పండు పెట్టకపోయినా కనీసం అరటిపండునైనా నైవేద్యంగా పెట్టాలని అంటారు. హనుమంతుడిని ప్రత్యేకించి కదలిపూజ చేయడానికి కూడా ఇదొక కారణం కావొచ్చు. మీరు కూడా హనుమంతుడిని ఇలా పూజించి చూడండి తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఇది నేను చెబుతున్న మాటలు కాదు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలే మీ ముందు ఉంచుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *