చంద్రుడిని ఢీకొట్టిన రహస్య వస్తువు… ఆందోళనలో అంతర్జాతీయ నిపుణులు

చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉండదు. భూమిని ఢీకొట్టేందుకు వచ్చే ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించగానే అధిక ఒత్తిడితో పాటు ఆక్సీజన్‌ మిళితం కావడంతో మండిపోతాయి. కానీ, చంద్రుడిపై ఎటువంటి వాతావరణం ఉండదు కాబట్టి చంద్రుడి వైపు ఆకర్షించే వస్తువులు నేరుగా వెళ్లి ఆ గ్రహాన్ని ఢీకొడతాయి. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి చంద్రుడిపై జరిగింది. ఓ రహస్య వస్తువు చంద్రుడిని ఢీకొన్నట్టుగా కెమెరాల్లో రికార్డైంది. ఇలా ఢీకొట్టిన వస్తువు స్పేస్‌ రాక్‌ లేదా గ్రహశకలం అయి ఉంటుందని అంటున్నారు.

ఎందుకు ఇది ప్రత్యేకం?

చంద్రుడిని గతంలో కూడా పలు అంతరిక్ష రాళ్లు లేదా గ్రహశకలాలు ఢీకొట్టిన సంగతి విదితమే. అయితే, ఇలా ఢీకొట్టినపుడు క్రేటర్లు ఏర్పడతాయి. క్రేటర్లు అంటే అతిపెద్దదైన గుంత అని. ఇలాంటి గుంతలు చంద్రుడిపై కొన్ని లక్షలు ఉన్నట్టుగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఏర్పడిన క్రేటర్లు కొన్ని కోట్ల సంవత్సరాలపాటు ఉండిపోతాయి. ఎటువంటి వాతావరణం లేకపోవడం, వర్షం, గాలి, భూకంపాలు వంటికి లేకపోవడం వలన క్రేటర్లు అలానే ఉండిపోతాయి.

కానీ, ఈ సంఘటన ఎందుకు సందేహాలు రేకెత్తిస్తోంది?

సాధారణ కెమెరాల్లో చంద్రుడిని ఢీకొట్టిన వస్తువులు కనిపించవు. కానీ, ఇటీవల రికార్డైన దృశ్యాలు సాధారణ కెమెరాల్లోనూ బంధీ అయ్యాయి. అందుకే ఈ ఘటనను ప్రత్యేకంగా చెబుతున్నారు. భారీ వస్తువు అయి ఉంటుందని లేదా అతిపెద్ద వస్తువు ఏదైనా ఢీకొట్టి ఉంటుందని చెబుతున్నారు. ఇది కేవలం రాయి మాత్రమేనా లేదంటే అంతరిక్షంలో మరేదైనా గ్రహం లేదా గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టి ఉంటుందా అని సందేహాలు కలుగుతున్నాయి.

మరో కోణం – అంతరిక్ష శకలాలు

కొన్ని సందర్భాల్లో పాత రాకెట్‌ భాగాలు, శాటిలైట్‌ అవశేషాలు కూడా చంద్రుడిపై పడిపోతాయి. భూమి చుట్టూ తిరుగుతున్న పాత ఉపగ్రహాలు, రాకెట్‌ దేహాలు భ్రమణంలో నుంచి తప్పిపోతే, అవి చంద్రుడి వైపు ఆకర్షితమై ఢీకొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రహస్య వస్తువు కూడా ఒక అంతరిక్ష మిషన్‌ అవశేషం అయి ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మానవ జిజ్ఞాస

చంద్రుడిని ఢీకొనడం వంటి సంఘటనలు శాస్త్రపరంగా సహజమైనవే అయినప్పటికీ, మానవ మనసు మాత్రం ఎప్పుడూ కొత్త కోణాల్లో ఆలోచిస్తుంది. “అంతరిక్షంలో ఇంకేదైనా తెలియని జీవం ఉందా?”, “ఏదైనా అజ్ఞాత వస్తువా?” అనే ఊహాగానాలు, చర్చలు చెలరేగుతుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *