ఏముందో తెలియదుగాని…12 మిలియన్‌ డాలర్లకు కొన్నారు

అన్నా ఇందులో ఏముంది అంటే… ఏముందని చెప్తాం… ఏం లేదా అంటే…ఏంలేదు అని కూడా చెప్పలేం. కానీ, ఇందులో ఏదో ఉంది. మనకు తెలియంది…మనకు అర్ధంగాని మర్మం ఏదో ఉంది. బహుశా అందుకే ఈ క్యాన్వాస్‌ ఆర్ట్‌ని ఏకంగా 12 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. వైట్‌ క్యాన్వాస్‌పై బ్లాక్‌ బ్రష్‌ను ఉపయోగించి నాలుగు గీతలు గీశారు. ఈ గీతలు ఏంటన్నది కూడా ఎవరికీ తెలియదు. చైనీస్‌ భాషలో ఒక అక్షరం ఉన్నట్టుగా మాత్రమే ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆర్టిస్ట్ మనసులో ఉండే భావం ఆర్ట్‌పై ఇష్టం ఉన్నవాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఇలాంటి మనకు అర్ధంగాని ఆర్ట్స్‌ మిలియన్‌ డాలర్లకు అమ్మడవుతూ ఉంటాయి.

https://twitter.com/i/status/1983784380821573702

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *