రజనీకాంత్ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 పదుల వయసులోనూ రజనీకాంత్ యువకులతో పోటీపడీ సినిమాలు చేస్తున్నాడు. రజనీ హీరోగా వచ్చిన జైలర్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా రికార్డులను తుడిచివేసింది. కాగా, దీనికి సీక్వెల్‌గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమాలో తెలుగు హీరో బాలకృష్ణ కీలక రోల్ చేస్తున్నారు. అయితే, ఇదే సినిమాలో మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణతో పాటు నాగార్జున కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. నాగార్జున విలన్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రజనీతో కలిసి నాగార్జున కూలీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నది. కాగా, జైలర్‌లో కూడా నాగార్జున నటిస్తుండటం అందులోనూ విలన్ రోల్ చేస్తుండటంతో సినిమాపై బజ్ మరింతగా క్రియేట్ అయింది. ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన మన్మధుడు నాగార్జున విలన్‌గా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. టాలీవుడ్ నుంచి సుమన్, జగపతిబాబు విలన్‌గా మంచి సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఆ కోవలోనే నాగార్జున కూడా విలన్‌గా మెప్పిస్తారా చూడాలి.
Related Posts

నిర్మలమ్మ Budget…టాప్ 10 అంశాలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన Budgetలో పేదలు, యువకులు, రైతులు, మహిళల శ్రేయస్సు కోసం ప్రధానంగా 10 అంశాలపై దృష్టి…
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన Budgetలో పేదలు, యువకులు, రైతులు, మహిళల శ్రేయస్సు కోసం ప్రధానంగా 10 అంశాలపై దృష్టి…

Curry Leaves గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
కూరల్లో కరివేపాకులా ఎందుకు తీసేస్తావని అంటుంటారు. అంటే కూరల్లో వేసే కరివేపాకు అంటే చాలా మంది చులకన భావం ఉంటుంది. కానీ, ఆ కరివేపాకు ఆరోగ్యపరంగా ఎన్ని…
కూరల్లో కరివేపాకులా ఎందుకు తీసేస్తావని అంటుంటారు. అంటే కూరల్లో వేసే కరివేపాకు అంటే చాలా మంది చులకన భావం ఉంటుంది. కానీ, ఆ కరివేపాకు ఆరోగ్యపరంగా ఎన్ని…

కాకరకాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలం
కాకరకాయ (Bitter Gourd / Bitter Melon) ఆరోగ్యానికి మేలు చేసే ఒక అద్భుతమైన కూరగాయ. దీనిలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు వలన శరీరానికి అనేక…
కాకరకాయ (Bitter Gourd / Bitter Melon) ఆరోగ్యానికి మేలు చేసే ఒక అద్భుతమైన కూరగాయ. దీనిలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు వలన శరీరానికి అనేక…