రజనీకాంత్ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 పదుల వయసులోనూ రజనీకాంత్ యువకులతో పోటీపడీ సినిమాలు చేస్తున్నాడు. రజనీ హీరోగా వచ్చిన జైలర్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా రికార్డులను తుడిచివేసింది. కాగా, దీనికి సీక్వెల్‌గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమాలో తెలుగు హీరో బాలకృష్ణ కీలక రోల్ చేస్తున్నారు. అయితే, ఇదే సినిమాలో మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణతో పాటు నాగార్జున కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. నాగార్జున విలన్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రజనీతో కలిసి నాగార్జున కూలీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నది. కాగా, జైలర్‌లో కూడా నాగార్జున నటిస్తుండటం అందులోనూ విలన్ రోల్ చేస్తుండటంతో సినిమాపై బజ్ మరింతగా క్రియేట్ అయింది. ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన మన్మధుడు నాగార్జున విలన్‌గా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. టాలీవుడ్ నుంచి సుమన్, జగపతిబాబు విలన్‌గా మంచి సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఆ కోవలోనే నాగార్జున కూడా విలన్‌గా మెప్పిస్తారా చూడాలి.
Related Posts
శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు
కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు.…
కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు.…
బాలయ్య అఖండ 2 రిలీజ్ ఎందుకు పోస్టుపోన్ అయ్యిందంటే???
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ మీద ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. అలాంటి అఖండ 2 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సడన్…
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ మీద ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. అలాంటి అఖండ 2 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సడన్…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజాసాబ్ డైరెక్టర్ మారుతి
ప్రభాస్ రాజా సాబ్ సినిమా రిలీజ్ ట్రైలర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే… ఐతే సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ మారుతి ఈరోజే తిరుమల శ్రీవారిని కుటుంబం తో…
ప్రభాస్ రాజా సాబ్ సినిమా రిలీజ్ ట్రైలర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే… ఐతే సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ మారుతి ఈరోజే తిరుమల శ్రీవారిని కుటుంబం తో…