ప్రతిరోజూ కడుపున పుట్టిన పిల్లలతో కన్నవాళ్లు మాట్లాడుతూ ఉండాలని విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణ్ రావు అన్నారు. స్థానిక వీటీ అగ్రహారం యాత వీధిలో విజయనగరం రూరల్,టూటౌన్,గంట్యాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ జరిగింది. అనంతరం స్థానికులను సమావేశపరచిన సీఐ లక్ష్మణ్ రావు నేరాలకు చెందిన అంశాలపై అవగాహన కల్పించారు.
యాత వీధి వాసులకు సీఐ లక్ష్మణ్‌రావు సూచన
స్కూల్ కో,కాలేజీకో,ఉద్యోగానికి, కూలి పనికో ఇంటి నుంచీ బయటకు వెళ్లొచ్చిన పిల్లలతో ప్రతీ రోజూ పిల్లల కన్నవాళ్లు ప్రతీ రోజూ మాట్లాడుతుండాలన్నారు. ఇంటి నుంచీ బయటకు వెళ్లిన పిల్లలు తిరిగి ఎంత రాత్రి వచ్చిన వాళ్లతో మాట్లాడాలన్నారు.అప్పుడే ఎదుగుతున్న పిల్లల్లో నా కోసం ఇంటి లో అమ్మ,నాన్న,అక్క,చెల్లి,అన్న,తమ్ముడు ఉన్నారన్న ఆలచోనతో చెడు మార్గాల వైపు ఏ ఒక్కరూ వెళ్లరు ఆపై చూడరన్నారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆరు నెలలకొక మారు ఇస్తున్న తన నివేదికలో నేరాలు పెరిగేందుకు పిల్లలతో కన్నవాళ్లు మాట్లాడక పోవడమే కారణమని కేంద్రానికి నివేదిక ఇచ్చిందన్నారు.
రికార్డ్స్ లేని పదకొండు బైక్స్ సీజ్
అంతకముందు తెల్లవారు జామున 5 నుంచీ ఏడు గంటలవరకు రూరల్,టూటౌన్, ,గంట్యాడ,ఈగల్ బృందాలు సంయుక్తంగా వీటీ అగ్రహారం యాత వీధితో కార్డన్ సెర్చ్ చేసారు. వీధిలో ఉన్న 100 గడపలలో ప్రతీ గడపను తనిఖీలు చేసారు.ఈ తనిఖీలలో సరైన ధృవ పత్రాలు లేని పదకొండు వాహనాలను సీజ్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ తనిఖీలలో ఎస్ఐలు సాయికృష్ణ,రామారావు,మూర్తి,ఏఎస్ఐలు మీనాక్షి,రామకృష్ణ, పీసీలు రాధిక, అలేఖ్య,సునీత,దుర్గా ప్రసాద్, ఈగల్ అధికారి విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.