కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేత నితిన్ గడ్కారీ. నిగర్విగా, నిరాడంబరుడిగా, అందరివాడుగా పేరుగాంచిన నితిన్ గడ్కారీ భారత రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారులు ఎంతో వేగంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నాయి అంటే దానికి నితిన్ గడ్కారి ముందు చూపే కారణం. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌తో రాజకీయాల్లోకి వచ్చిన నితిన్ గడ్కారీ పూణే నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే రోడ్డు కనెక్టివిటీ ముఖ్యమని నమ్మిన వ్యక్తి ఆయన. ఆ నమ్మకంతోనే దేశంలోని ప్రతి ప్రాంతాన్ని రోడ్డు మార్గంతో కనెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నేడు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. అంతేకాదు, జాతీయ రహదారులను కేవలం వాహనాల కోసమే కాకుండా అత్యవసర సమయంలో యుద్ధ విమానాలను దించేందుకు అవసరమైన రన్‌వే గా కూడా ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే యమునా ఎక్స్‌ప్రెస్ హైవే, చెన్నై కోల్‌కతా హైవేలపై ట్రయల్స్ కూడా నిర్వహించారు. రాబోయే రోజుల్లో అత్యవసరం అనుకుంటే విమానాల కోసం కూడా హైవేలను వినియోగించుకోవచ్చు. దేశానికి ఎనలేని సేవలు అందిస్తున్న నితిన్ గడ్కారీ పుట్టిన రోజు మే 27. ఆయన పుట్టినరోజు సందర్భంగా తన ఇంట ఎలాంటి సందడి నెలకొన్నదో ఈ వీడియో చూస్తే మీకే అర్దమౌతుంది.