ఓ పెద్ద టిప్పర్ లారీ వచ్చి కారును గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ సముద్రంలో కాదు…భూమిపై వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నా పవర్ స్టార్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఓ మాస్ పవర్ హీరో. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న తాను ఒప్పుకున్న వాటిని పూర్తి చేసేందుకు, అభిమానులను అలరించేందుకు సమయం దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నారు. రెట్రో గ్యాంగ్‌స్టర్ కథతో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఈ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫొటోస్ అన్నీ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పవన్ కత్తిపట్టిన తీరు ఆయన అభిమానులను పిచ్చెక్కించేలా చేసింది. దాని ఫలితమే ప్రీ సేల్ రికార్డులు. ఇప్పటికే నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో 9 లక్షల డాలర్ల టికెట్ సేల్ జరిగింది. పవర్ స్టార్ పుట్టిన రోజునాడు భారీ ఎత్తున ప్రీ సేల్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా, అమెరికాతో పాటు ఇప్పుడు యూకేలోనూ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ ఏ స్థాయిలో బుకింగ్స్ నమోదవుతాయో చూడాలి. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Related Posts
ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధం – పవన్ కళ్యాణ్
•తీర ప్రాంత మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు•మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం•త్వరలో పిఠాపురం వేదికగా ప్రకటన ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల సర్వతోముఖాభివృద్ధి…
•తీర ప్రాంత మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు•మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం•త్వరలో పిఠాపురం వేదికగా ప్రకటన ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల సర్వతోముఖాభివృద్ధి…
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం… భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
నెట్ఫ్లిక్స్ మరింత విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రపంచంలోని ఫార్చూన్…
నెట్ఫ్లిక్స్ మరింత విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రపంచంలోని ఫార్చూన్…
ప్రధాని మోడి గంగైకొండ చోళపురం దేవాలయాన్ని సందర్శించడం వెనుక కారణాలేంటి?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించడం వెనుక ఉన్న కారణాలు చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, మరియు ఆధ్యాత్మిక కోణాల నుండి ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించడం వెనుక ఉన్న కారణాలు చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, మరియు ఆధ్యాత్మిక కోణాల నుండి ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ…