లాస్ట్ ఇయర్ మన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమా తో పర్వాలేదనిపించి, OG తో సూపర్ అనిపించాడు. ఇక నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసాడు.
ఈ మూడు సినిమాలతో పవన్ సినిమా కెరీర్ కి బ్రేక్ పడింది అనుకున్నాం… కానీ సడన్ గా ఈరోజు న్యూ ఇయర్ సందర్బంగా అభిమానులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ అందింది.
దాదాపు నాలుగేళ్ల క్రితం అధికారికంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా… ఈరోజు మళ్ళి ఆఫీసియల్ గా అనౌన్స్ చేసారు. ఈ ప్రాజెక్ట్ చాలా త్వరలోనే స్టార్ట్ అవుతుందని నిర్మాత రామ్ తాళ్లూరి స్పష్టంగా వెల్లడించారు.
ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా న్యూ ఇయర్ గిఫ్ట్ అనే చెప్పచు! OG బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ మరిన్ని సినిమాలు చేయాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగలాంటి వార్త!
2021 సెప్టెంబర్‌లో… పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డితో కలిసి ఒక భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నట్లు రామ్ తాళ్లూరి ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలతో… మంత్రి, డిప్యూటీ సీఎం బాధ్యతలతో పవన్ బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అనిశ్చితి నెలకొంది.
అదే సమయంలో హరిహర వీర మల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాల షూటింగ్‌లు ఆలస్యం కావడం… పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలకు సమయం కేటాయిస్తారా అనే సందేహాలను మరింత పెంచాయి.
ఇలాంటి పరిస్థితుల్లో… ఈ ప్రాజెక్ట్ తిరిగి ట్రాక్‌లోకి వస్తుందన్న అధికారిక ప్రకటన అభిమానులకు ఊహించని ఆనందాన్ని ఇచ్చింది.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే… రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడే కాకుండా, జనసేన పార్టీ భవిష్యత్ రూపకల్పనలో జనరల్ సెక్రటరీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో… ఈ సినిమా కార్యరూపం దాల్చే అవకాశాలు ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తున్నాయి.
సినిమా కథ, స్క్రీన్‌ప్లే విషయంలో సురేందర్ రెడ్డికి మంచి మిత్రుడు వక్కంతం వంశీ మరోసారి సహకరించనున్నారని సమాచారం. మిగతా నటీనటులు, సాంకేతిక బృందంపై త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.