ప్రపంచ ఛాంపియన్స్‌తో ప్రధాని మోదీ

దేశానికి నాయకుడు అంటే కేవలం పార్టీ వ్యవహారాలు అధికారంలోకి వస్తే పాలన వ్యవహారాలు మాత్రమే చూసుకోవడం కాదు. దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రమోట్‌ చేయాలి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా క్రీడారంగంలో రాణిస్తున్న చాంపియన్స్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సన్మానించాలి. వారిలో ధైర్యం నింపాలి. వారికి అండగా ఉండాలి. నేనున్నాననే భరోసా ఇవ్వాలి. ప్రధాని మోదీ ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నాడు. దేశానికి చెందిన ఛాంపియన్లు ఎవరైనా సరే వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇటీవల మహిళా వరల్డ్‌కప్‌లో విజయం సాధించిన విమెన్‌ టీమ్‌తో ఇంటరాక్ట్‌ అయ్యి వారిని ప్రోత్సహించాడు. తాజాగా అంథుల క్రికెట్‌ పోటీల్లో మహిళల టీమ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విమెన్‌ టీమ్‌తో ఇంటరాక్ట్‌ అయ్యి వారిలో మరింత ప్రోత్సాహం అందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *