మరో ఏడాదిలో తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికల వరకు తమిళ ప్రజలు సంప్రదాయానికి కట్టుబడి ఒకరికి ఒకసారి, మరో పార్టీకి మరోసారి అవకాశం ఇస్తూ వస్తున్నారు. అయితే, తమిళనాడు రాజకీయాల్లో ఉద్ధండులుగా చెప్పుకునే జయలలిత, కరుణానిధి ఇద్దరూ ఇప్పుడు లేరు. ప్రస్తుతం కరుణానిధికి చెందిన డీఎంకే పార్టీ అధికారంలో ఉన్నది. కాగా, ఇప్పుడు సినీ హీరో థలపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. టీవీకే పార్టీని స్థాపించి ప్రచారం కూడా మొదలుపెట్టారు. టీవీకే పార్టీ 70 వేల మంది బూత్‌స్థాయి కార్యకర్తలను నియమించుకొని గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలో 2026 ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ ఎన్నికల్లో విజేత ఎవరు? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో పోల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Poll: 2026 తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది?
[forminator_poll id=”3652″]