రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ ని ఇవాళ భారీ స్థాయిలో లాంచ్ చేశారు. భూషణ్ కుమార్ ఇంకా ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ లాంచ్ ఈవెంట్ సినీ వర్గాల్లో భారీ హడావిడి రేపింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై వేడుకకి అదిరిపోయే గ్లామర్, స్పెషల్ ఎనర్జీని తీసుకొచ్చారు. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టడం ద్వారా సినిమా ప్రారంభమైంది. ప్రభాస్ కూడా ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు గాని, లుక్ రిలీజు చేయకూడదనే నిర్ణయం మేరకు మేకర్స్ ఏ ఫొటోలు షేర్ చేయలేదు. అయినప్పటికీ చిరంజీవితో చేతులు కలుపుతున్న ప్రభాస్ కనిపించే ఒక పిక్ మాత్రం బయటకు వచ్చింది.
లాంచ్ డేలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాకి త్రిప్తి దిమ్రీ హీరోయిన్… Animal మూవీతో భారీ క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తి దిమ్రీ, ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ వంటి పలువురు ప్రముఖులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రభాస్ బర్త్‌డే సందర్భం గా విడుదలైన యూనిక్ సౌండ్-స్టోరీ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో రికార్డుల స్థాయిలో బజ్‌ను సృష్టించింది. ఇందులోని యాక్షన్ ఫీల్డ్ ఇంకా నేరేటివ్ టోన్ ఈ సినిమా ఎంత వరల్డ్-క్లాస్ లెవల్‌లో ఉంటుందో చూపిస్తోంది.