రామ్ చరణ్ పెద్ది షూటింగ్ అప్డేట్…

రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ షూటింగ్‌ను వేగవంతం చేశారు.

ఈ సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్, అగ్రసేన్ కి బావోలి వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో షూటింగ్ జరపాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఢిల్లీ షెడ్యూల్ కొన్ని నెలల పాటు వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఢిల్లీ షూటింగ్ సుమారు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. క్లైమాక్స్ సీక్వెన్స్ ఇంకా ఒక ప్రత్యేక పాటను మినహాయిస్తే, మిగతా సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

ఇటీవల రామ్ చరణ్‌తో పాటు ‘పెద్ది’ టీమ్ ఢిల్లీకి బయల్దేరింది. Delhi Times కథనం ప్రకారం, నవంబర్‌లో రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన బాంబ్ పేలుడు ఘటన తర్వాత ఈ షూట్‌ను తిరిగి షెడ్యూల్ చేశారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్ సమీపంలో రామ్ చరణ్ షూటింగ్‌లో పాల్గొంటూ కనిపించారు. అయితే భారీ పొగమంచు కారణంగా షూటింగ్ దాదాపు మూడు గంటల పాటు ఆలస్యం అయింది. అనంతరం ఉదయం చివర్లో షూటింగ్ తిరిగి ప్రారంభమై, సాయంత్రం అగ్రసేన్ కి బావోలి వద్ద షూటింగ్ కొనసాగింది. ఈ ఢిల్లీ షెడ్యూల్ మొత్తం నాలుగు రోజులుగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

గ్రామీణ వాతావరణం తో వచ్చే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిజమైన ఫీల్ తీసుకురావాలని దర్శకుడు బుచ్చి బాబు రియల్ లొకేషన్స్‌ను ఎంచుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో షూటింగ్ చేయడం చాలా కష్టమైన పని అని సమాచారం. అనుమతుల కోసం టీమ్ నెలల తరబడి ఎదురు చూసిన తర్వాత చివరకు అక్కడ షూటింగ్ చేసే అవకాశం దక్కింది. ఆ ఓపికకు ఇప్పుడు మంచి ఫలితం దక్కిందని చెప్పాలి.

ఢిల్లీ షెడ్యూల్ పూర్తయ్యాక, సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక పాటను షూట్ చేసి మొత్తం సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. గతంలో ఈ స్పెషల్ సాంగ్‌లో కాజల్ అగర్వాల్ కనిపిస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *