ఈ సంక్రాంతికి రవి తేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విడుదలై మంచి హిట్ అనిపించుకుంది. కానీ బ్లాక్బస్టర్ అవ్వలేదు కాబట్టి మాస్ మహారాజా రవితేజ నిజంగా పూర్తిస్థాయి కంబ్యాక్ ఇచ్చాడా లేదా అన్న విషయంపై ఇంకా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
సంక్రాంతి విడుదలల్లో రాజా సాబ్ చివరి స్థానంలో నిలవగా, రవితేజ సినిమా దాని కంటే కాస్త పై స్థానంలో నిలిచింది. పండుగ సీజన్ కారణంగా సినిమాకు వసూళ్లు వచ్చినప్పటికీ, కంటెంట్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది.
దీంతో నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు వంటి హిట్ సినిమాల కంటే ఈ సినిమా వెనుకబడింది. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
ఇక నెక్స్ట్ రవితేజ ఫామిలీ కథల దర్శకుడు శివ నిర్వాణతో కలిసి ఓ కొత్త సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తండ్రి–కూతురు మధ్య బలమైన అనుబంధం, ఎమోషన్‌తో కూడిన యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. రధ సప్తమి సందర్భాన అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసి, రేపు రిపబ్లిక్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారంట!
దీని తర్వాత మాస్ మహారాజా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సరిపోదా శనివారం విజయానికి తర్వాత వివేక్ కొంతకాలం విరామం తీసుకొని, ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాకి రెడీ అవుతున్నాడు.
ఇటీవల వివేక్ ఆత్రేయ రజనీకాంత్, సూర్య వంటి తమిళ అగ్ర హీరోలకు కథలు వినిపించాడనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రవితేజతో ఆయన కాంబినేషన్‌పై వార్తలు మరింత ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా, ఇటీవల వరుస ఫ్లాప్‌ల తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తికు వచ్చిన డీసెంట్ రెస్పాన్స్ రవితేజ అభిమానులను మాత్రం సంతృప్తిపరిచింది.