శంషాబాద్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్‌లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్‌కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్‌లు నిత్యం పది వరకు శంషాబాద్‌లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
Related Posts
జమైకా రాజధానిని అతలాకుతలం చేసిన హరికేన్ మెలిస్సా
కింగ్స్టన్ సముద్రతీర ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా అలలు పెరిగి ఇళ్లలోకి నీళ్లు ముంచెత్తాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ టవర్లు కూలిపోవడంతో సంప్రదింపులు…
కింగ్స్టన్ సముద్రతీర ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా అలలు పెరిగి ఇళ్లలోకి నీళ్లు ముంచెత్తాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ టవర్లు కూలిపోవడంతో సంప్రదింపులు…
వైఎస్సార్సీపీది భయమా? బెదురా?
రాష్ట్రంలో రైతుల పరిస్థితి విషమంగా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. సగటున ప్రతి రైతు మీద 2 లక్షల అప్పు ఉందని, రైతుల…
రాష్ట్రంలో రైతుల పరిస్థితి విషమంగా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. సగటున ప్రతి రైతు మీద 2 లక్షల అప్పు ఉందని, రైతుల…
ఈ చెట్లు మీ ఇంట్లో ఉన్నాయా… దోమలకు హడలే
దోమలు కేవలం మనల్ని ఇబ్బంది పెట్టడమే కాదు మలేరియా, డెంగ్యూ, చికున్‌గునియా వంటి ప్రమాదకర వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. మార్కెట్లో లభించే కెమికల్ స్ప్రేలు, కాయిల్స్…
దోమలు కేవలం మనల్ని ఇబ్బంది పెట్టడమే కాదు మలేరియా, డెంగ్యూ, చికున్‌గునియా వంటి ప్రమాదకర వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. మార్కెట్లో లభించే కెమికల్ స్ప్రేలు, కాయిల్స్…