తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,872 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం రోజున భక్తుల రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, రూ. 300 టికెట్ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆదివారం రోజున హుండీ ద్వారా రూ. 4.06 కోట్ల ఆదాయం లభించింది.
Related Posts
పెద్ది ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి…
నార్మల్ గా సినిమా ప్రమోషన్స్ అంటే సోషల్ మీడియా లో టీజర్, ట్రైలర్ పోస్టర్స్ ఇంకా ప్రీ-రిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి అనుకునే వాళ్ళం కదా……
నార్మల్ గా సినిమా ప్రమోషన్స్ అంటే సోషల్ మీడియా లో టీజర్, ట్రైలర్ పోస్టర్స్ ఇంకా ప్రీ-రిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి అనుకునే వాళ్ళం కదా……
ఈరోజు పంచాంగం ప్రకారం శుభాశుభ సమయాలు ఇవే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు ఈరోజు భాద్రపద మాస బహుళ పక్ష ద్వాదశీ తిథి రా.11.24 వరకూ తదుపరి త్రయోదశి తిథి, పుష్యమీ…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు ఈరోజు భాద్రపద మాస బహుళ పక్ష ద్వాదశీ తిథి రా.11.24 వరకూ తదుపరి త్రయోదశి తిథి, పుష్యమీ…
భారతీయ సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా నటిస్తున్న నటులు వీరే
భారతీయ సినిమా పరిశ్రమ అంటేనే వివిధ భాషలు, సంస్కృతులు, అద్భుతమైన కథలతో నిండిన ఒక మహా సామ్రాజ్యం. ఇందులో కొందరు నటులు తమ నటనా జీవితాన్ని 50…
భారతీయ సినిమా పరిశ్రమ అంటేనే వివిధ భాషలు, సంస్కృతులు, అద్భుతమైన కథలతో నిండిన ఒక మహా సామ్రాజ్యం. ఇందులో కొందరు నటులు తమ నటనా జీవితాన్ని 50…