తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,872 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం రోజున భక్తుల రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, రూ. 300 టికెట్ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆదివారం రోజున హుండీ ద్వారా రూ. 4.06 కోట్ల ఆదాయం లభించింది.
Related Posts
పీఎఫ్ అకౌంట్లో తప్పులున్నాయా…సింపుల్గా ఇలా మార్చుకోండి
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ ఎంతో కీలకం. ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం ఉద్యోగి భవిష్యత్తు కోసం ఈపీఎఫ్ ఖాతాలో జమ…
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ ఎంతో కీలకం. ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం ఉద్యోగి భవిష్యత్తు కోసం ఈపీఎఫ్ ఖాతాలో జమ…
హైందవధర్మంలో తాళి ఎందుకు ధరించాలో తెలుసా?
మంగళసూత్రం – హిందూ వివాహ సంస్కృతిలో ఆధ్యాత్మిక చిహ్నం మంగళసూత్రం అనే పదం సంస్కృతంలో “మంగళ” అంటే శుభం, “సూత్ర” అంటే తాడు లేదా దారం అని…
మంగళసూత్రం – హిందూ వివాహ సంస్కృతిలో ఆధ్యాత్మిక చిహ్నం మంగళసూత్రం అనే పదం సంస్కృతంలో “మంగళ” అంటే శుభం, “సూత్ర” అంటే తాడు లేదా దారం అని…
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
•ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.…
•ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.…