కార్తీ ‘అన్నగారు వస్తారు’ సినిమా రిలీజ్ డేట్ పోస్టుపోన్…

నందమూరి బాలకృష్ణ అఖండ 2 విడుదల రేపు అంటే 12th కి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే… ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అవ్వాల్సింది కానీ EROS ప్రొడక్షన్ హౌస్ చెన్నై కోర్ట్ లో వేసిన కేసు కారణంగా ఒక వారం తరవాత రిలీజ్ అవుతుంది… ఇప్పుడు same సీన్ మల్లి రిపీట్ అవుతుంది…

తమిళ్ లో ఒక భారీ సినిమా కూడా నిర్మాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెద్ద చిక్కుల్లో పడింది. కార్తి హీరోగా తెరకెక్కిన ‘వా వతియార్’ (తెలుగులో అన్నగారు వస్తారు) రేపు డిసెంబర్ 12న తమిళం – తెలుగు రెండు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌తో పూర్తిగా నిలిచిపోయింది. 2014లో స్టూడియో గ్రీన్‌కు చెందిన నిర్మాత జ్ఞ్యనవేల్ రాజా ఫైనాన్సియర్ అర్జున్‌లాల్ నుంచి ₹10.35 కోట్లు అప్పు తీసుకోగా, కాలక్రమేణా వడ్డీతో కలిసి ఆ బకాయిలు ఇప్పుడు ₹21.78 కోట్లకు పెరిగాయి.

ఈ మొత్తం పూర్తిగా చెల్లించకపోవడంతో, ఫైనాన్సియర్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఏడు సార్లు అవకాశాలు ఇచ్చినా జ్ఞ్యనవేల్ రాజా బకాయిలను సర్దుబాటు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలను పూర్తిగా అడ్డుకునేలా స్టే ఇచ్చి, బకాయిలు క్లియర్ చేసే వరకు వా వతియార్ (అన్నగారు వస్తారు) చిత్రాన్ని ఏ థియేటర్‌లోనైనా, ఏ ప్లాట్‌ఫారమ్‌లోనైనా విడుదల చేయకూడదు అని స్పష్టం చేసింది.

నిర్మాత తరఫున న్యాయవాది 24 గంటల్లో ₹3.75 కోట్లు చెల్లిస్తామని, మిగతా మొత్తానికి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పినప్పటికీ, కోర్టు ఇప్పటికే చాలావరకు అవకాశాలు ఇచ్చామని, ఇక సినిమా విడుదల అనుమతించలేమని స్పష్టంగా పేర్కొంది. దీంతో రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా తప్పకపోవడం ఖాయం అయింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కార్తి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ యాక్షన్ డ్రామా, నిర్మాత ఆర్థిక బకాయిలు క్లియర్ చేసే వరకు ఇప్పుడు నిరవధికంగా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *