Native Async

చైనాలో భోజనంతోపాటు ఇలా డ్యాన్స్‌ కూడా ఉంటుంది

China Hotel Delivers Food with a Dancing Girl Performance — Viral Dining Experience
Spread the love

రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం ఆర్డర్‌ చేస్తే…భోజనమే వస్తుంది…మనం ఏది ఆర్డర్‌ చేస్తే దానిని సర్వర్లు తెచ్చి ఇస్తారు. అయితే, కొన్ని చోట్ల కస్టమర్లను ఆకట్టుకునేందుకు కాంప్లిమెంట్‌ పేరుతో సూప్‌ లేదా ఏదైనా స్పెషల్‌ డిష్‌ను ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఇలాంటి కాంప్లిమెంటరీ ఇస్తే… అక్కడికే కష్టమర్లు వస్తుంటారు. కానీ, చైనాలోని ఓ రెస్టారెంట్‌లో భోజనంతో పాటు సరికొత్తగా, ఎవరూ ఊహించని కాంప్లిమెంటరీ ఇస్తారు. అయితే, ఇది తినేది ఏమాత్రం కాదు. చూసి ఆనందించేది మాత్రమే. మనసారా ఆనందిస్తే చాలు…తీసుకునే ఆహారాన్ని మరింతగా తీసుకోవచ్చని రెస్టారెంట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా కాంప్లిమెంటరీ అంటారా…అక్కడికే వస్తున్నా. భోజనం సప్లై చేసిన వెంటనే వారి టేబుల్‌ వద్దకు డ్యాన్సింగ్‌ గర్ల్స్‌ వస్తారు. భోజనం చేసే ముందు కస్టమర్లను ఆనందింపజేసేందుకు కాసేపు వారి వద్ద డ్యాన్స్‌ చేస్తారు. వారి డ్యాన్స్‌ ఫిదా అయిన కస్టమర్లు హ్యాపీగా భోజనం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *