ఇలా చేస్తే ఎవరైనా పడిపోతారు

This Trick Can Make Anyone Fall Instantly
Spread the love

ఆనాడు ఓ సినీకవి ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్నాడు. కానీ, ఈ రోజుల్లో ప్రేమ కఠినమైనా…మనం ఎక్స్‌ప్రెస్‌ చేసే దానిని బట్టి ప్రియురాలు బహు మధురంగా ఉంటుంది. మధురైన మాటలు చెప్పేవారు ఉంటే చాలు. తెలియని వాళ్లను కూడా బుట్టలో వేసుకునే ట్రిక్స్‌ను కొందరు ఫాలో అవుతుంటారు. కొంచం స్కిల్స్‌ ఉంటే చాలు. ఈజీగా పడేయవచ్చు. టాలెంట్‌ ఉన్నోడిని ఏవీ ఆపలేవు గురు అన్నట్టుగా, ఇక్కడ ఈ వీడియోలో ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ ఫోన్‌ మాట్లాడుతున్న ఓ అమ్మాయి ఫొటోను తీసిన అబ్బాయి, తన ట్యాలెంట్‌తో ఫిల్టరింగ్‌ యాప్స్‌ ఉపయోగించి బ్యాక్‌గ్రౌండ్‌ మార్చేసి మరింత అందంగా, అద్భుత చిత్రంగా మలిచాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అలా తయారు చేసిన ఫొటోను అమ్మాయికి డైరెక్ట్‌గా చూపించడం అన్నదే ఛాలెంజ్‌. ధైర్యంగా అడుగేస్తేనే గురు ఎదైనా సాధించగలిగేది. అన్నట్టుగా ఆ యువకుడు ఫొటోను అమ్మాయికి చూపించడం, అమ్మాయి ఆ ఫొటోకు ఫిదా కావడం జరిగిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంతవరకు మాత్రమే మనం చెప్పగలం. మిగతా జర్నీ గురించి మనకు తెలియదు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద కామెంట్‌ చేస్తే వాళ్లేమైనా రెస్పాన్స్‌ ఇస్తారేమో. ఈ పాయింట్‌ను బేస్‌ చేసుకొని ఓ మంచి లవ్‌స్టోరీ సినిమాటిక్‌ కథను కూడా తయారు చేసుకోవచ్చు.

కర్ణాటకలో మళ్లీ మొదలైన రాజకీయ ముసలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *