కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం జోక్యంతో ఈ కుమ్ములాటలకు చెక్ పడింది. కాగా, తాజాగా మరోసారి ఇంటి గొడవలు రచ్చకెక్కడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై కర్ణాటక మంత్రి రాజన్న స్పందించిన తీరు సరిగా లేదనే కారణంగా ఆయన్ను పదవి నుంచి తప్పించింది. పార్టీ నుంచి తప్పించడంతో ఆయన వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్దమౌతున్నారని, కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరబోతున్నారని, బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి రాజన్న కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెసీ బాలకృష్ణ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నేత, రాజన్న కుమారుడు రాజేంద్ర రాజన్న తిప్పికొట్టారు. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో హెసీ బాలకృష్ణ కూడా ఉన్నారని, ఆయనే కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రికి పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. చాలా కాలం తరువాత మరోసారి రాజకీయంగా కర్ణాటకలో దుమారం రేగడంతో ఈ దుమారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Related Posts
కార్తీకమాసం విశిష్టత…పాటించవలసిన నియమాలు ఇవే
కార్తీకమాసం ప్రారంభమౌతుంది అంటే ప్రకృతి మొత్తం ఆధ్యాత్మిక శ్వాస తీసుకుంటున్నట్టుంటుంది. ఆశ్వయుజ బహుళ అమావాస్య పూర్తవ్వగానే పాడ్యమి తిథి ప్రారంభమౌతుంది. పాడ్యమి నుంచి అంటే అక్టోబర్ 22…
కార్తీకమాసం ప్రారంభమౌతుంది అంటే ప్రకృతి మొత్తం ఆధ్యాత్మిక శ్వాస తీసుకుంటున్నట్టుంటుంది. ఆశ్వయుజ బహుళ అమావాస్య పూర్తవ్వగానే పాడ్యమి తిథి ప్రారంభమౌతుంది. పాడ్యమి నుంచి అంటే అక్టోబర్ 22…
ఖాట్మండ్ టూ గాజులరేగ …యాత్రికులంతా సురక్షితం
నేపాల్ లో జరుగుతున్న అల్లర్లుకు గాజులరేగ ఒక్కసారి ఉలిక్కిపడింది.ఆ దేశానికి గాజులరేగ ఎక్కడ…దానికి సంబందం ఏంటని సమాలోచనలు చేస్తున్నారు కదా…సంచలనాత్మక, సరికొత్త ఆన్ లైన్ వెబ్ సైట్…
నేపాల్ లో జరుగుతున్న అల్లర్లుకు గాజులరేగ ఒక్కసారి ఉలిక్కిపడింది.ఆ దేశానికి గాజులరేగ ఎక్కడ…దానికి సంబందం ఏంటని సమాలోచనలు చేస్తున్నారు కదా…సంచలనాత్మక, సరికొత్త ఆన్ లైన్ వెబ్ సైట్…
యుద్ధభయం…కొట్టుమిట్టాడుతున్న బంగారం
ప్రపంచ రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ఎంత ప్రభావం చూపుతాయో చెప్పడానికి తాజా బంగారం ధరల హెచ్చుతగ్గులే సాక్ష్యం. సాధారణంగా యుద్ధ వాతావరణం నెలకొంటే పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్గా…
ప్రపంచ రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ఎంత ప్రభావం చూపుతాయో చెప్పడానికి తాజా బంగారం ధరల హెచ్చుతగ్గులే సాక్ష్యం. సాధారణంగా యుద్ధ వాతావరణం నెలకొంటే పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్గా…