పురాతనమైన చెట్టునుంచి ఉబికి వస్తున్న నీరు

Water Gushes Out from 100-Year-Old Sacred Onyina Tree in Ghana
Spread the love

మనిషి వందేళ్లు బతుకుతాడో లేదో తెలియదుగాని, గాలి, వాన, ఎండను ఎదుర్కొని నిలబడగలిగితే చెట్లు వందేళ్లకు మించి బతుకుతాయి. అలా బతికిన చెట్లు ఈ భూమిపై చాలా ఉన్నాయి. అయితే, మనిషి తన అవసరాల కోసం చెట్లను కొట్టేస్తూ వాటి ఎదుగుదలను ఆదిలోనే తొక్కేస్తున్నారు. వందేళ్లకు మించి బతికిన, ఇప్పటికీ బతికే ఉన్న చెట్లు మనకు ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో ఒకటి ఘనాలో ఉంది. ఆ చెట్టుపేరు ఒన్యినా. దీనిని పవిత్రమైన చెట్టుగా అక్కడి ప్రజలు పూజిస్తారు. ఇలాంటి వందేళ్లకు పైబడిన ఓ చెట్టును స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు నిరికేసేందుకు ప్రయత్నించారు. దాని కాండాన్ని నరికేందుకు ప్రయత్నించగా, చెట్టు నుంచి నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. పవిత్రమైన చెట్టుగా భావించే ఈ ఒన్యినా చెట్టునుంచి వస్తున్న నీటికి శక్తి ఉంటుందని, పలు జబ్బులను నయం చేయగలుతుందని స్థానికులు నమ్ముతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *