సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలిసారి ఇంకో పెద్ద స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్న సంగతి తెలిసిందే… కమల్ హాసన్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాత్కాలికంగా #Thalaivar173 అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు యువ దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శివకార్తికేయన్‌తో తెరకెక్కిన ‘డాన్’ సినిమాతో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ అందుకున్న సిబి చక్రవర్తి ఎంపిక అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
అలాగే సీబీ చక్రవర్తి కూడా సోషల్ మీడియా లో ఈ న్యూస్ రెవీల్ చేస్తూ పెద్ద పోస్ట్ పెట్టాడు…
“Once, a small-town boy’s big dream was to meet his favourite star “SUPER STAR” & take a picture with him, which drove his passion towards cinema — and the big dream happened one day. Then he had the biggest dream of directing his Superstar. He came so close, but got missed. Then he continued to believe it would happen one day — and today is that day. #Thalaivar173 Day . And I remember Thalaivar saying, “Dreams do come true. Miracles do happen.” At times, life goes beyond dreams and becomes even bigger, with legendary Ulaganayakan, Padma Shri @ikamalhaasan sir and #Mahendran sir as our producer. Grateful forever @rajinikanth sir, @ikamalhaasan sir & #Mahendran sir — and I promise to put my heart & soul to keep up the trust. Big thanks to @Disneyhttp://bro.So happy to be working again with my dearest @anirudhofficial sir. Love you sir”.
ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాయి కాబోతోంది. ఇండస్ట్రీలోని ఇద్దరు దిగ్గజాలు—రజనీకాంత్, కమల్ హాసన్—ఒకే ప్రాజెక్ట్‌లో కలవడం అనేది నిజంగా ప్రత్యేకమైన సందర్భం. దీనికి మరింత బలాన్నిచ్చేలా, సంగీత దర్శకుడిగా యువతలో సంచలనం సృష్టించిన అనిరుధ్ రవిచందర్‌ను ఎంపిక చేశారు.
అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రధాన నటీనటులు, కీలక సాంకేతిక బృందాన్ని ఇప్పటికే ఖరారు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. సహాయక పాత్రలు ఇంకా ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను రాబోయే నెలల్లో ప్రకటించనున్నారు.