రాజమౌళి మహేష్ బాబు వారణాసి సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా???

SS Rajamouli–Mahesh Babu’s Varanasi Release Date Buzz: Global Release Planned for April 9, 2027?

వారణాసి… ఇప్పుడు ఎక్కడ చుసిన ఈ సినిమా గురించే చర్చ… ఎందుకంటే ఒక వైపు మహేష్ బాబు, ఇంకా హీరోయిన్ ప్రియాంక చోప్రా… వాళ్ళిద్దరిని అడ్డుకునేందుకు విలన్ ప్రిథ్వీరాజ్. ఇంకా చాలదు అన్నట్టు, ప్రకాష్ రాజ్… ఇంత మంది పెద్ద నటులు పైగా రాజమౌళి సినిమా ఇంకా మహేష్ రాముడి క్యారెక్టర్ ఆమ్మో ఈ హైప్ తత్తోకోలేం రా బాబు అంటున్నారు…

ఐతే ఇప్పుడు ఈ సినిమా గురించి కోతగ్గ తెలిసిన విషయం ఏంటంటే, రిలీజ్ డేట్… ఎస్ మీరు విన్నది నిజమే! 2026 లో సినిమా రిలీజ్ ఉండదు కానీ 2027 లో అది కూడా సమ్మర్ అంటే exact గా 2027 ఏప్రిల్‌ 9న విడుదల కానున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ సినిమా ని ఒకటో రెండో దేశాల్లో కాదు ఏకంగా 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ అవుతుందట.

ఇంకా జనవరి 5న ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను పారిస్‌లోని లే గ్రాండ్‌ రెక్స్‌ థియేటర్‌లో ప్రదర్శించారు అన్న సంగతి తెలిసిందే కదా. ఇంటర్నేషనల్‌ ఆడియన్స్‌ నుంచి ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది.

లేటెస్ట్ గా ఈ విషయం ‘లే గ్రాండ్‌ రెక్స్‌’ వాళ్ళ official సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. దీంతో అక్కడ ప్రదర్శించిన తొలి భారతీయ సినిమా గ్లింప్స్‌గా ‘వారణాసి’ రికార్డు నెలకొల్పింది. గతంలో రజనీకాంత్‌ ‘కబాలి’, ప్రభాస్‌ ‘బాహుబలి 2’, ‘సాహో’ చిత్రాలను ఈ థియేటర్‌లో ప్రదర్శించారు. ఆమ్మో ఐతే వారణాసి ని రిలీజ్ కి ఏడాది ముందే రికార్డ్స్ బద్దలుకొడుతుంది!

Also Read  INCA అవార్డ్స్ మొదటి ఎడిషన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *