పిల్లలు పుట్టిన వెంటనే “నాన్న పోలిక”, “అమ్మ పోలిక” అంటూ కుటుంబాల్లో చర్చలు మొదలవుతాయి. కానీ వైద్య నిపుణులు, జన్యు శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే… కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఎక్కువగా తండ్రి జీన్స్ ప్రభావంతోనే పిల్లలకు వస్తాయట. ముఖ్యంగా ఎత్తు విషయంలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా తండ్రి జన్యువుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీర నిర్మాణం అంటే సన్నగా ఉండటం, దృఢంగా ఉండటం లేదా బరువు త్వరగా పెరగడం వంటి బాడీ టైప్ లక్షణాలు కూడా నాన్న నుంచే ఎక్కువగా వారసత్వంగా వస్తాయని చెబుతున్నారు. జుట్టు విషయంలో కూడా తండ్రి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందట. కర్లీ జుట్టా, స్ట్రెయిట్ జుట్టా అనే విషయం ఎక్కువగా నాన్న జీన్స్ మీదే ఆధారపడి ఉంటుంది.
కళ్ల రంగు విషయంలోనూ తండ్రి లక్షణాల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, చర్మ రంగు కూడా చాలా సందర్భాల్లో తండ్రి పోలికగానే పిల్లల్లో కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఆహారం, జీవనశైలి, పర్యావరణ ప్రభావాల వల్ల కొంతమేర మార్పులు వచ్చినా, జన్యుపరమైన లక్షణాలు మాత్రం జీవితాంతం ప్రభావం చూపుతూనే ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందుకే పిల్లల్లో కనిపించే పోలికలు కేవలం యాదృచ్ఛికం కాదు… జన్యు విజ్ఞానంలో దాగిన సహజ అద్భుతం.