విజయనగరం ఎస్పీ బంగ్లాకు సంక్రాంతి శోభ

Vizianagaram SP Bungalow Gets Festive Sankranti Makeover After Decades

గ‌డ‌చిన ద‌శాబ్దాలుగా పాత భ‌వ‌నం రూపంలో ఉన్న విజ‌య‌న‌గ‌రం లో ఉన్న ఎస్పీ బంంగ్లాకు కొత్త రూపం వ‌చ్చింది. సంక్రాంతి పండుగ శోభ క‌నిపిస్తోంది.ఏళ్ల త‌ర‌బ‌డి మెరుగులు అద్ద‌క‌, శిధిలావ‌స్థ స్థితిలో ఉన్న జిల్లా పోలీస్ కార్యాల‌యం సంక్రాంతి పుణ్య‌మ శ‌నివారం కొత్త శోభ కాన‌వ‌స్తోంది.

జిల్లాకు ఇప్ప‌టి వ‌ర‌కు 32 మంది పోలీస్ సూప‌రెంటెండెంట్ లు ప‌ని చేసినా ఏ ఒక్క‌రూ తాను ఉంటున్న‌,తాను ప‌ని చేస్తున్నబంగ్లా, కార్యాల‌యాన్ని ఆదునీక‌రించాల‌న్న ఆలోచ‌న రాలేదు.గ‌తంలో అంటే అయిదేళ్ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో జిల్లాకు ఎస్పీగా ప‌ని చేసిన ఏ.ఆర్.దామోద‌ర్ కు జిల్లాలో ప‌ని చేసిన అనుభ‌వం, అప్ప‌ట్లోనే తాను ఉంటున్న ఎస్పీ బంగ్లా,ప‌ని చేస్తున్న జిల్లా పోలీస్ కార్యల‌యపు స్థితి గ‌తుల‌పై ఒక అంచాన అప్పుడే వ‌చ్చి ఉంటారు.

కూట‌మి ప్ర‌భుత్వం పుణ్య‌మా తిరిగి జిల్లాకు ఎస్పీ గాబాధ్య‌తలు చేప‌ట్టిన‌ప్పుడే రెండింటి భ‌వ‌నాల స్థితి గతులు వాటి మ‌ర‌మ్మత్తుల‌పై ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ తోనూ, త‌న కార్యాల‌య సిబ్బందితో చ‌ర్చించారు కూడ‌.అయితే కొత్త‌గా రానున్న మూడ‌వ ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ,అలాగే ప్ర‌స్తుత రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ స్థానంలోనే నాల్గ‌వ పోలీస్ స్టేష‌న్ ప్ర‌తిపాద‌న‌లు ముందుకు రావ‌డంతో త‌న బంగ్లా,తాన ప‌ని చేస్తున్న డీపీఓ ను మ‌ర‌మ‌త్త ప‌నుల విష‌యంలో పోలీస్ శాఖ కాస్త ఆలోచించింది.

అయితే శ్ర‌మ‌దానంతో వాటికి మెరుగులు అద్దొచ్చన్న ఆలోచ‌న‌కు బాస్ వ‌చ్చారు.ఈ క్ర‌మంలోనే వీఎంసీ ప‌రిధి లో మ‌యూరీ జంక్ష‌న్ 33వ డివిజ‌న్ లో ఉంటున్న అప్పుడెప్పుడో బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఎస్పీ బంగ్లా రూపు రేఖ‌లు మార్చారు.బంగ్లా ప్ర‌ధాన ప్ర‌వేశం వ‌ద్దే “ఎస్పీ బంగ్లా”అంటూ ఆంగ్లంలో కొత్త అక్ష‌రాల‌కు సొబ‌గులు అద్ది అద్దంగా,అంద‌రికీ తెలిసేలా బంగ్లా ఆదునీక‌ర‌ణ ప‌నులు పూర్తయ్యాయి.

ఇక కంటోన్మెంట్ లో ఉన్న జిల్లా పోలీస్ కార్యాల‌యం భ‌వ‌నానికి కూడా కొత్త గా మెరుగులు దిద్ది ఆదునీక‌రించారు.సొ అటు బంగ్లాకు,ఇటు డీపీఓకు సంక్రాంతి శోభ ఉట్టి ప‌డుతోంది.ఈ క్ర‌మంలోనే పోలీస్ శాఖ‌లో అందునా మ‌హిళా సిబ్బందితో ఈ నెల 13 వ తేదీన స్థానిక పోలీస్ బ్యారెక్స్ లో ముగ్గుల పోటీల‌ను కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని డీపీఓ ఏఓ శ్రీనివాస్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *