డబ్బు లేదని వదిలేసింది: విజయ్ కార్తీక్

Vijay Karthik Breaks Silence on Split with Bigg Boss Fame Keerthi Bhat After Engagement

స్టార్ మా సీరియల్స్ ద్వారా ఇంకా బిగ్‌బాస్ ద్వారా ఫేమ్ సంపాదించిన కీర్తి భట్, నటుడు విజయ్ కార్తీక్ కి లాస్ట్ ఇయర్ ఎంగేజ్‌మెంట్ అయ్యింది అన్న సంగతి తెలిసిందే కదా… ఐతే నిన్ననే కీర్తి సోషల్ మీడియా ద్వారా తమకు బ్రేక్ అప్ అయ్యింది అని చెప్పయింది! అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి బ్రేక్ అప్ పెద్ద చర్చకే దారితీస్తోంది. అనేక రకాల ఊహాగానాలు, ఆరోపణలు, ట్రోల్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై తొలిసారి విజయ్ కార్తీక్ స్పష్టంగా స్పందించారు.

కీర్తిని తానే వదిలేశాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని విజయ్ ఖండించారు. సోషల్ మీడియాలో తనపై పడుతున్న ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని, నిజాన్ని తెలియకుండా తాను తప్పు చేసినట్టుగా మాట్లాడటం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విడిపోవడానికి కారణంగా కీర్తి చెప్పిన ప్రధాన అంశాన్ని కూడా విజయ్ బయటపెట్టారు. తాను ఇప్పటికీ ఆర్థికంగా పూర్తిగా స్థిరపడలేదన్న కారణంతోనే కీర్తి ఈ నిర్ణయానికి వచ్చిందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తుపై భద్రత వంటి అంశాలను ఆమె ఎక్కువగా ఆలోచించిందని, అందుకే ఈ బంధాన్ని కొనసాగించడం కష్టమని భావించి తన నుంచి దూరమైందని తెలిపారు.

ఈ నిర్ణయం తనకు ఎంతో బాధను కలిగించినప్పటికీ, ఆమె ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని విజయ్ అన్నారు. తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో ద్వారా కార్తీక్ ఈ విషయం పై స్పందించారు…

కార్తీక్ ఎం చెప్పారంటే, “కీర్తి భట్ నిన్న తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టుని చూసి నాకు చాలా మంది కామెంట్స్ చేశారు. మీ జంట చూడముచ్చటగా ఉంది, దయచేసి విడిపోకండి అంటూ చెప్పుకొచ్చారు. కానీ నేను ఆమెతో విడిపోవాలని అనుకోలేదు, ఆమెనే నాతో విడిపోవాలని అనుకుంది. డిసెంబర్ లోనే నాకు ఆమె ఈ విషయం చెప్పింది. ఆర్థికంగా నేను స్టేబుల్ గా లేనని ఆమె నిర్ణయం తీసుకుంది. కేవలం నా దగ్గర డబ్బులు లేవని వదిలేయడం కరెక్ట్ కాదని ఆమెకి చెప్పే ప్రయత్నం చేశాను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఆమెని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. కాంప్రమైజ్ అవుతూ జీవించలేనని, నీకంటే నాకు బెటర్ ఛాయస్ గా ఒకరు దొరికారని చెప్పింది.

అలా చెప్పిన తర్వాత కూడా ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చాలానే చేసాను, కానీ ఆమె నిర్ణయం తీసేసుకున్నాను, వదిలేయ్ అని చెప్పింది. ఇక చేసేది ఏమి లేక నేను కూడా లైట్ తీసుకున్నాను. కీర్తి భట్ కి ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నాను, కనీసం ఇప్పుడు ఆమె రిలేషన్ పెట్టుకున్న వ్యక్తితో అయినా సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంది కీర్తి మీతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో తొలగించింది, మీరు కూడా తీసేయండి అని అడుగుతున్నారు. కానీ అలాంటి పోస్టులు పెట్టడం వెనుక నాకు ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ తాలూకు పెయిన్ ఎప్పుడైతే తగ్గుతుందో, అప్పుడే డిలీట్ చేస్తాను”.

ఈ వ్యాఖ్యలతో విడిపోవడంపై వస్తున్న ట్రోల్స్‌కు విజయ్ ఒక విధంగా చెక్ పెట్టినట్టయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *