మెగాస్టార్ చిరంజీవి… ప్రస్తుతానికి అనిల్ రావిపూడి తో చేసిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొడుతుంది. ఇంకా అంతకంటే ఎం కావాలి??? మన మెగాస్టార్ ని వింటేజ్ లుక్ లో చూసి ఆనందపడ్డాం కదా. ఇంకా చిరు కూడా ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన ఆనందం లో ఉన్నారు. అలాగే తన నెక్స్ట్ సినిమా బాబీ తో చేస్తున్నట్టు అనౌన్స్ కూడా చేసారు. అలానే ఈ సినిమా ని నెక్స్ట్ మంత్ సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
ఐతే ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి గారి పుట్టిన రోజు సందర్బంగా అమ్మ కోసం చిరు అద్భుతమైన వీడియో షేర్ చేస్తూ, తన ఫాన్స్ ని ట్రీట్ చేసాడు…
ఈ వీడియో లో మెగాస్టార్ తన తమ్ముళ్లు, చెల్లెళ్ళతో పాటు, మెగా ఫామిలీ అంత ఉన్నారు… మరి ఎంత రాజైన తల్లికి కొడుకే కదా… అలానే తల్లి ప్రేమ అంటే మాటల్లో చెప్పగలమా???
పుట్టిన రోజు శుభాకాంక్షలు అంజనా దేవి గారు!