మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… మన అందరికి ఇష్టమైన హీరో కదా… అలాగే మన మెగాస్టార్… ఆమ్మో అయన అంటే, మన ఇంట్లో మనిషే కదా… అయన సినిమాలు TV లో వస్తే అతుక్కుపోయి చూస్తాం!
ఇప్పుడు ఆ ఇంట డబల్ ఆనందం… అదే నండి మన రామ్ చరణ్ ఉపాసన లకు ట్విన్స్ పుట్టారు నిన్న రాత్రి… సో, నిన్న రాత్రి నుంచి అపోలో హాస్పిటల్ దెగ్గర అసలు ఫాన్స్ హడావిడి మాములుగా లేదు… అలాగే చిరంజీవి కూడా ఈ న్యూస్ ని ట్విట్టర్ లో షేర్ చేసి అందరికి పెద్ద శుభ వార్త చెప్పారు…
ఇది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల జీవితంలో అపూర్వమైన ఆనంద క్షణాలు. అలాగే కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంతోషం రెట్టింపయ్యింది.
ఈ వార్త వెలువడగానే రెండు కుటుంబాల్లోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కొణిదెల కుటుంబానికి ఇది మరో మధురమైన మైలురాయిగా క్షణం అని అందరు అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి తాతగా మరోసారి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారన్న విషయం అభిమానులను మరింత సంతోషపరిచింది.
ఈ విషయాన్ని ఎక్స్‌లో పంచుకుంటూ చిరంజీవి ఎంతో ఎమోషనల్ గా స్పందించారు.
“With immense joy and a heart full of gratitude, we are happy to share that ram charan and upasana
have been blessed with twins – a baby boy and a baby girl. Both the babies and the mother are healthy and doing well. Welcoming these little ones into our family is a moment of pure joy and divine blessing for us as grandparents. We sincerely thank everyone for their prayers, love, blessings and good wishes. -Chiranjeevi & Surekha”
ఉపాసన తన సెకండ్ pregnancy విషయాన్ని 2025 అక్టోబర్‌లో ప్రకటించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా సీమంతం వేడుకను నిర్వహించారు. ఆ వేడుకలో ఉపాసన సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా ఆకట్టుకోగా, రామ్ చరణ్ కూడా కుటుంబంతో కలిసి ఆ మధుర క్షణాలను ఆస్వాదించారు. అప్పటి నుంచే మరో శుభవార్త కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా, ఇప్పుడు ఆ నిరీక్షణకు సంతోషకరమైన ముగింపు లభించింది.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2012లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, 2023లో తమ మొదటి సంతానంగా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారి రాకతోనే కొణిదెల కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పుడు కవల పిల్లల జననంతో ఆ ఆనందం మరింతగా పెరిగింది.