విజయ్ దేవరకొండ రష్మిక ల రిసెప్షన్ ఇన్విటేషన్ చూసారా???

Vijay Deverakonda and Rashmika Mandanna Wedding Buzz: Intimate Ceremony on Feb 26, Reception in Hyderabad

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ రష్మిక ల పెళ్లి హాట్ టాపిక్… పెళ్లి ఎప్పుడు, రిసెప్షన్ ఎప్పుడు, అసలు ఎందుకు వీరు పెళ్లి విషయాన్ని దాసీ పెడుతున్నారు అన్న డౌట్స్ వస్తున్నాయి!

ఐతే సోషల్ మీడియాలో ఇప్పటికే వారి రిసెప్షన్ ఇన్విటేషన్ లీక్ కావడంతో ఈ వార్త మరింత వేగంగా వ్యాపిస్తోంది. అయినప్పటికీ ఈ జంట మాత్రం ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా ఈ విషయాన్ని సర్ప్రైజ్‌గా ఉంచాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటో అభిమానులకు స్పష్టంగా అర్థం కావడం లేదు. అయితే కొందరి అభిప్రాయం ప్రకారం… పెళ్లి పూర్తయ్యాకే అధికారికంగా అభిమానులకు ఈ శుభవార్త తెలియజేయాలనే ఉద్దేశంతో వారు మౌనం పాటిస్తున్నారని చెబుతున్నారు.

రష్మిక ఇంకా విజయ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా జోడీగా కనిపించారు. ఈ రెండు సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరిందని, ఆ బంధం మెల్లగా ప్రేమ గా మారిందని సినీ వర్గాల్లో చాలాకాలంగా చర్చ సాగుతోంది. అయితే ఇన్ని రూమర్లు వచ్చినప్పటికీ… ఇద్దరూ ఎప్పుడూ తమ మధ్య ఏమీ లేదని, మంచి స్నేహితులమని మాత్రమే చెప్పుతూ వచ్చారు.

అయితే సోషల్ మీడియాలో వారు పంచుకున్న కొన్ని ఫోటోలు అభిమానుల్లో అనుమానాలను మరింత పెంచాయి. ఒకే ప్రదేశంలో తీసిన ఫోటోలు అయినా కలిసి కనిపించకపోవడం, వేర్వేరుగా వెకేషన్లకు వెళ్లి అదే లొకేషన్ నుంచి చిత్రాలను షేర్ చేయడం వంటి సంఘటనలు వారి సంబంధంపై కొత్త ఊహాగానాలకు దారి తీశాయి. ఇవన్నీ చూసిన అభిమానులు… వీరి మధ్య నిజంగా ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని భావించడం ప్రారంభించారు.

ఇటీవలి కాలంలో రష్మిక తన వ్యక్తిగత జీవితంపై నేరుగా స్పందించకపోయినా… సరైన సమయం వచ్చినప్పుడు అన్నింటినీ వెల్లడిస్తానని చెప్పడం ఆసక్తిని మరింత పెంచింది. దీంతో పెళ్లి వార్తలపై మరింత చర్చ మొదలైంది.

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ఈ జంట ఫిబ్రవరి 26న సన్నిహితుల మధ్య సాదాసీదా వేడుకగా వివాహం చేసుకోబోతున్నారు. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని తజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read  Prabhas's Raja Saab Three Days Collection Report

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *