నిన్న రాత్రి మెగా కపుల్ రామ్ చరణ్ ఇంకా ఉపాసన కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే… ఈ శుభ వార్త ని చిరంజీవి అపోలో హాస్పిటల్ దెగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికి చెప్పారు… అలానే ఈ క్షణం తమకి ఎంతో ఆనందంగా ఉందని కూడా చెప్పి, ఉపాసన, పిల్లలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని కూడా చెప్పారు…

‘‘రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు శనివారం రాత్రి కవలలు జన్మించారు. దీంతో కొణిదెల, కామినేని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఆ భగవంతుడి దయ, హనుమాన్ కృపతో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారు. ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంట శుభం కలగాలని ఎక్కడెక్కడి నుంచో కోరుకున్నారు. ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు దీన్ని పండుగలా భావిస్తున్నారు. వారి ఆనందానికి అవధుల్లేవు. అందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పి మెగాస్టార్ అందరిని ఆనందపడేలా చేసారు…
అలానే చిరంజీవి తో పాటు, డాక్టర్స్ కూడా మాట్లాడి, ఉపాసన కి ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల పుట్టారని చెప్పారు…
ఐతే ఇక్కడ ఒక చిన్న కో-ఇన్సిడెన్స్… మెగాస్టార్ కి కూడా ఫస్ట్ కూతురు తరవాత చరణ్ లాస్ట్ కి శ్రీజ… ఇలా రామ్ చరణ్ కి కూడా ఫస్ట్ క్లిన్ కార అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూతురు కొడుకు పుట్టారు…