భారతీయ నేషనల్ సినీ అకాడమీ తొలి సారి నిర్వహిస్తున్న కళ్యాణ్ జ్యువెలర్స్ INCA అవార్డ్స్ గురించి ఆఫీసియల్ గా అనౌన్స్ చేసారు. ఈ కార్యక్రమం 2026 ఏప్రిల్ 15 ఇంకా 16 తేదీలలో ముంబైలో జరగనుంది. భారతదేశంలోని 12 సినీ పరిశ్రమలను ఒకే జాతీయ వేదికపై కలిపే ప్రత్యేక ప్రయత్నంగా ఈ అవార్డులు నిలుస్తాయి.
INCA అనే ఈ అకాడమీ లక్ష్యం భారతీయ సినిమాల్లో ఉన్న ప్రతిభను భాషలతో సంబంధం లేకుండా ఒకే చోట గౌరవించడం. ప్రతి పరిశ్రమను విడిగా కాకుండా, మొత్తం భారతీయ సినిమా ఒకటిగా కనిపించేలా ఈ వేదికను రూపొందించారు. ఇది భారతీయ కథల వైవిధ్యాన్ని ప్రపంచానికి చూపించే మంచి అవకాశం కూడా.
ఈ అకాడమీని ప్రముఖ నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి నిర్వహిస్తున్నారు. ఆయన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఇంకా SIIMA వంటి పెద్ద కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇంకా అయన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈ అవార్డులకు చీఫ్ పేట్రన్‌గా ఉండటం వల్ల పరిశ్రమ నుంచి బలమైన మద్దతు లభించింది. ఈ అవార్డ్స్ ఫస్ట్ ఎడిషన్ కి కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా చేరింది.

హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాళీ, భోజ్‌పురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, అస్సామీ, గుజరాతీ వంటి 12 భాషల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు ఇస్తారు. అలాగే దర్శకత్వం, సంగీతం, సాంకేతిక విభాగాలు, నటన ప్రతిభ, కొత్తగా వచ్చిన కళాకారులకు సంబంధించిన ఆల్-ఇండియా అవార్డులు కూడా ఉంటాయి.
2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాల నిర్మాతలు, దర్శకులు తమ చిత్రాలను మార్చి 1లోపు ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.
మొత్తానికి, INCA అవార్డ్స్ ద్వారా భారతీయ సినిమా ఒకే కుటుంబంగా కలిసి ప్రతిభను జరుపుకునే కొత్త దశ ప్రారంభమవుతోంది. ఇది భారతీయ సినీ ప్రపంచానికి ఐక్యతను, గౌరవాన్ని తీసుకురాబోతున్న ముఖ్యమైన అడుగు.