మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు ఒక మంచి హిట్ చాలా అవసరం. ప్రస్తుతం ఆయన ‘కొరియన్ కనకరాజు’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేశారు. ఈ చిత్రానికి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎలాగో ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ ఉంది కాబట్టి, ఆ తరవాత అయన ఏ సినిమా లో నటిస్తాడు అన్న ప్రశ్న కి సమాధానం ఇప్పుడు మేము చెప్పబోయే సినిమానే!

ఇక త్వరలో వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు బాలాజీతో పని చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. బాలాజీ ప్రముఖ దర్శకుడు అట్లీ శిష్యుడు. కథ విన్న వెంటనే వరుణ్ తేజ్‌కు చాలా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ప్రతిభావంతుడైన తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రెజెంట్ చేయనున్నారు. కథ, కాన్సెప్ట్ నచ్చడంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌లో కో-ప్రొడ్యూసర్‌గా కూడా చేరారు. స్టోన్ బెంచ్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
అలాగే వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘కమిటీ కుర్రోలు’ దర్శకుడు వంశీ యేడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానున్నాయి. త్వరలో అధికారిక ప్రకటనలు వెలువడనున్నాయి.