హైదరాబాద్‌ను దేశంలో అతిపెద్ద స్పోర్ట్స్ హబ్‌గా మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక – గచ్చీబౌలి స్టేడియానికి వరల్డ్ క్లాస్ అప్‌గ్రేడ్

CM Revanth Reddy Plans to Transform Hyderabad into India’s Premier Sports Hub, Major Upgrades for Gachibowli Stadium Announced

క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

✅గచ్చీబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై ముఖ్యమంత్రి గారు #TelanganaSportsHub ప్రతినిధులతో సమావేశమయ్యారు.

✅ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ సంజీవ్ గారు, కో-చైర్మన్ ఉపాసన గారు, సభ్యులు కావ్య మారన్ గారు, సి.శశిధర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

✅తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన #GachibowliStadium అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, ఆ లోగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఆ స్టేడియంలో హెలిప్యాడ్‌తో పాటు ప్రపంచస్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.

✅క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని, స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌ను నియమించామని తెలిపారు.

✅“స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం. #Olympic క్రీడలు కూడా హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలి. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలి..” అని బోర్డు సభ్యులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *