యోగ వేరు యోగం వేరు…రెండింటికి మధ్య వ్యత్యాసం ఇదే

యోగ వేరు యోగం వేరు…రెండింటికి మధ్య వ్యత్యాసం ఇదే

యోగ వేరు యోగం వేరని శ్రీ స్వామి అంతర్ముఖానంద అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్న వరస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో యోగా డే ఉత్సవం జరిగింది. సరిగ్గా ఇదే రోజున అపరవాల్మీకి, శ్రీ స్వామి శివానందుల వారి 77 సమాధి ఆరాధన జరిగింది. ఈ సందర్బంగా ఆశ్రమం పూజాది కార్యక్రమాల అనంతరం శ్రీ గురూజీ భాషణం జరిగింది. ఈ సందర్బంగా శ్రీగురూజీ మాట్లాడుతూ యోగ అనది ఫిజికల్ ఎక్సరసైజ్ అని యోగం అంటే ప్రాణాపాణాలను అంటే ఉఛ్వాస, నిస్వాసలను రాపిడి చేయడమే యోగమని దీన్ని ప్రతీ ఒక్కరూ అభ్యసించాలన్నారు. ఆ విద్య గురుదేవుల వద్దే పొందవలెనని అన్నారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లో చెప్పిందే అద అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ, చక్రవర్తి, నాగేశ్వరావు, డా హరగోపాల్, డా సుబ్రహ్మణ్యం హరికిషన్, లక్ష్మణరావు, కుమార్ తదితరులు హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *