అప్పుడే హిట్టైన తేజ సజ్జ మిరాయి

Teja Sajja Mirai
Spread the love

మిరాయి… ఇప్పుడు అందరు మాట్లాడుకునేది ఈ సినిమా గురించే! ఐతే ఈ సినిమా ఈ నెల 5th న రిలీజ్ అవ్వాలి కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా 12th న తారీఖున రిలీజ్ అవుతుంది… ఇందులో బేసిక్ స్టోరీ మనకి ఆల్రెడీ ట్రైలర్, టీజర్ లోనే చూపించారు… మన అశోకుడి కాలం నుంచి కాపాడుకుంటున్న 9 గ్రంధాల భాద్యత ఇప్పుడు తేజ సజ్జ అదే మన సూపర్ హీరో యోధుడి పై పడుతుంది… అలాగే మరి వాటిని దక్కించుకోవడం కోసం బ్లాక్ స్వోర్డ్ అదే మంచు మనోజ్ సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు.

అలాగే ఆ తొమ్మిది గ్రంధాలూ లోకం బాగుండాలని తేజ కాపాడతాడు లేకపోతె లోకాన్ని జయించాలని పరితపించే మనోజ్ గెలుస్తాడా అనేది సినిమాలోనే చూడాలి. ఆల్రెడీ PROMOTIONS తో సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేశారు టీం.

మనోజ్ తన కామెడీ టైమింగ్ తో అలరిస్తుంటే, తేజ తన తెలివైన సమాధానాలతో మీడియా ని కూడా మెప్పించాడు. ఇలా సినిమా మీద భలేగా అంచనాలు పెంచి అప్పుడే సినిమాని ప్రాఫిట్స్ లోకి తీసుకొచ్చారు వీళ్లిద్దరు.

అది ఎలాగా అంటే, చెప్తాం చుడండి… సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 60 కోట్లు అంటున్నారు… అంత గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్న సినిమా అంత తక్కువ బడ్జెట్ ఆ అంటే, హనుమాన్ సినిమా అంత కంటే తక్కువ బడ్జెట్ కదా మరి!

సో, ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఈ సినిమా ఆల్రెడీ నాన్ – థియేట్రికల్ రైట్స్ ద్వారా 45 కోట్లు వచ్చాయంటే… అంటే ఇంకా చిన్న చిన్న కమిట్మెంట్స్ ద్వారా ఆల్మోస్ట్ 20 కోట్లు వచ్చాయంట…

సో, సినిమా ఇప్పుడు ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయింది… ఆమ్మో అప్పుడే హిట్ అన్నమాట… సో, చూద్దాం కలెక్షన్స్ తో ఇంకెంత దుమ్ము దులుపుతుందో! మంచు మనోజ్ కి ఈ సినిమా హిట్ అవ్వడం ముఖ్యం. ఆల్రెడీ భైరవం సినిమా తో హిట్ కొట్టేసాడు. సో, ఇప్పుడు మిరై హిట్ ఐతే ఇక మనోజ్ ని ఎవ్వరు అప్పలేరు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *