గోదావరిలో వినాయక నిమజ్జనాలు ఎలా జరిగాయో చూశారా?

వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణనాథులను పూజించిన భక్తులు, ఆ తరువాత ఆ విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే, ఈ నిమజ్జన వేడుకలు ఒక్కోచోట ఒక్కోవిధంగా జరిగాయి. భారీ క్రేన్లతో కొన్ని చోట్ల సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో నిమజ్జనం చేస్తే రాజమహేంద్రవరంలోని గోదావరిలో విగ్రహాల నిమజ్జనం అందర్నీ ఆకట్టుకునేవిధంగా జరిగింది. విగ్రహాలను నదిలో విసిరేయకుండా, వాటిని పడవలో పెట్టుకొని నది మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. భక్తిశ్రద్ధలతో పూజించిన వాటిని క్రేన్ల సహాయంలో విసిరేయడం, కాలితో తొక్కడం, నిమజ్జనం సమయంలో విగ్రహాలు విరిగిపోవడం చేయకూడదని, అలా చేస్తే ఆ భగవంతుడికి మనపై కోపం వస్తుందని అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజమహేంద్రవరంలో విగ్రహాల నిమజ్జనం నదిమధ్యలో ఈ వీడియో చూపిన విధంగా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *