ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక ఫోటో అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. టాలీవుడ్ బిజీ హీరోలలో ఒకడైన ఎన్టీఆర్ తరచుగా విదేశాల్లో తన షూటింగ్‌లతో బిజీగా ఉంటారు. ఇదే క్రమంలో, ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ఆఫీస్‌కి వెళ్లి వచ్చిన విషయం బయటకి వచ్చింది.
జూనియర్ NTR కూడా ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ, ఆ కన్సుల్టే అధికారిణికి థాంక్స్ చెప్పాడు…
ఈ సందర్శనకు సంబంధించిన ఫోటోను స్వయంగా కాన్సులేట్ అధికారిణి ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, “@tarak9999 గారిని కాన్సులేట్‌కి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన తాజా మరియు రాబోయే సినిమాలు అమెరికాలో చిత్రీకరణ జరుపుకోవడం ద్వారా ఉద్యోగాలు సృష్టించడం, ఇండియా – అమెరికా సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రతీకగా నిలిచాయి” అని రాసింది.
ఆ ఫోటోలో కనిపించిన ఎన్టీఆర్ లుక్‌కి అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకు మునుపు కన్నా చాలా సన్నగా కనిపిస్తున్న ఆయన ఫిజిక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనక ఎన్టీఆర్ వేసిన కష్టమే కారణం అని అభిమానులు చెబుతున్నారు.
ఈ లుక్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం కావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓ larger-than-life పాత్రకు తగిన కసితో, స్టైల్‌తో ఎన్టీఆర్ కనిపించడం అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. మొత్తానికి, ఈ కొత్త లుక్ ఆయన ఫ్యాన్స్‌కి ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పొచ్చు.