టాలీవుడ్ లో మాస్, క్లాస్ ఆడియెన్స్ ఇద్దరికీ బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించే మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ ఇప్పుడు ఒక భారీ పాన్-ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ‘సాంబరాల యేటిగట్టు (SYG)’ పేరుతో వస్తున్న ఈ సినిమాకి రోహిత్ కే.పీ దర్శకత్వం వహిస్తుండగా, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి లు నిర్మిస్తున్నారు.
ఈ దసరా సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. అక్టోబర్ 15న సాయి దుర్ఘ తేజ్ బర్త్‌డే రోజున విడుదల కానున్న అసురాగమనం గ్లింప్స్ కి ముందు, ఒక ప్రీ-గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో కనిపించిన ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. “ఇది కేవలం చిన్న స్పార్క్ మాత్రమే… అసలు అగ్ని ఇంకా మిగిలే ఉంది” అని మేకర్స్ చెప్పిన మాటలు, ఈ సినిమా మీద హైప్‌ని మరింత పెంచాయి.
టెక్నికల్ ఫ్రంట్ లో కూడా ఈ మూవీ అద్భుతంగా నిలుస్తోంది. కెమెరా వెనుక వెట్రి పాలనిసామి మ్యాజిక్ క్రియేట్ చేస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ బి. అజనీష్ లోక్‌నాథ్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలకు ఊపు తెచ్చారు.
మొత్తానికి ‘సాంబరాల యేటిగట్టు’ అనే టైటిల్ కి తగిన రేంజ్ లోనే సినిమా విజువల్స్, యాక్షన్ ట్రీట్ గా రాబోతుందని ఈ ప్రీ-గ్లింప్స్ చెప్పేసింది. ఇక అక్టోబర్ 15న వచ్చే అసురాగమనం గ్లింప్స్ తో సినిమా మీద క్రేజ్ మల్టిపుల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.