బాస్కెట్ బాల్‌లో మహిళా టీమ్ అదరగొట్టేసింది. ఫిబా అండర్ 16 ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా విజయం సాధించి ఛాంపియన్ ఫిప్‌ను సొంతం చేసుకుంది. మొక్కవోని ధైర్యంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయంగా మార్చుకొని టైటిల్ విజయం కీలక పాత్రను పోషించారు తెలుగమ్మాయిలు జొన్నలగడ్డ విహారెడ్డి, బిరుదవోలు నేత్ర. ఎనిమిదో తరగతిలో బాస్కెట్‌బాల్ గేమ్ ఆడటం మొదలుపెట్టిన విహారెడ్డి 2024లో జాతీయ స్థాయిలోని జట్టులో ఆడటం ప్రారంభించినట్టు తెలిపారు.
ఒంటరిగా ప్రయాణించే మహిళలకు గుడ్ న్యూస్
కాలిచీలమండకు గాయం అయినా పట్టుదలతో ప్రయత్నించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు తెలిపారు. మలేషియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్ షిప్‌లో భారత్ టీమ్‌కు వైస్‌కెప్టెన్‌గా పనిచేయడం అదృష్టంగా తెలిపారు. అటు చదువును, ఆటను సమన్వయం చేసుకోవడం చాలా కష్టమని అమ్మ సహకారంతోనే ఈ రెండింటిని మ్యానేజ్ చేస్తూ వచ్చానని చెప్పింది నేత్ర. కష్టానికి తగిన ప్రతిఫలం లభించినపుడు శ్రమ కూడా ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు ఈ తెలుగమ్మాయిలు.