Native Async

మహాకాళి ఫస్ట్ లుక్ తో కట్టి పడేసిన ప్రశాంత్ వర్మ…

Mahakali First Look: Bhoomi Shetty Transforms Into Fierce Goddess Avatar in Prasanth Varma Cinematic Universe
Spread the love

మన హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మనన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేదు కదా… తాను చేసే సినిమాలు మాములుగా ఉండట్లేదు, ఎదో ఒక స్పెషలిటీ తో కట్టిపడేస్తున్నాయి. ఇప్పుడు మహాకాళి తో మళ్ళి మన ముందుకు వస్తున్నాడు.

ఈ సినిమా కి తాను డైరెక్టర్ కాకపోయినా, క్రియేటర్, ప్రేసెంటర్ అండ్ రైటర్, అన్ని తానే. ఇక ఈరోజు పొద్దునే హీరోయిన్ భూమి శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది… తనని ఒక శక్తిమంతమైన దేవీ గా తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యాడు.

భూమి శెట్టి ఫస్ట్ లుక్ మాత్రం… గూస్‌బంప్స్ తేప్పిస్తున్నాయ్. ఎరుపు-నలుపు రంగుల తిలకాలు, కళ్లలో అగ్ని, బంగారు ఆభరణాలతో ఆ దేవీ రూపం… శక్తి, కోపం, కరుణ అన్నీ ఒకేసారి కనిపించేలా ఉంది. ఈ చూపే చాలు… ఇది సాధారణ సినిమా కాదని తెలుస్తుంది.

ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంటే, ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ లోనే ఈ కథకి ప్రాణం పోసాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit