Native Async

మరో పదేళ్లలో America Economy కుదేలు

USA Economy downfall
Spread the love

ఇప్పటి వరకు అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న America రాబోయే రోజుల్లో పేదరికంలోకి జారుకోబోతోందా అంటే నిపుణులు అవుననే అంటున్నారు. ఒకప్పుడు ప్రతి దేశం అమెరికాపైనా, American Dollar పైనా ఆధారపడేవారు. వ్యాపార లావాదేవీలన్నీ అమెరికా డాలర్‌ మాధ్యమంగానే కొనసాగేవి.

అంతర్జాతీయ ట్రేడింగ్‌

ఏదేశమైన అంతర్జాతీయంగా ట్రేడింగ్‌ నిర్వహించాలంటే అమెరికా డాలరే శరణ్యం. అవగాహనారాహిత్యం, అంతర్జాతీయంగా ఉన్న ఒత్తిళ్లు, Technology అందుబాటులో లేకపోవడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా పెత్తనాన్ని ఒప్పుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు అలాంటి ఆటలు సాగబోవని అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను బట్టి తెలుస్తోంది. Europe సొంతంగా యూరోను తయారు చేసుకున్నాయి. యూరప్‌ దేశాలన్నీ Euro కరెన్సీలోనే ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నాయి.

ఆసియా దేశాల వ్యాపారం

ఇక ఇప్పుడు China తన సొంత కరెన్సీ యూనాన్‌ను, Russia రూబుల్‌ను, India రూపీలోనూ వ్యాపారం చేస్తున్నాయి. ఏదైనా అంతర్జాతీయంగా వ్యాపారం నిర్వహిస్తే డాలర్ల రూపంలో చెల్లించకుండా నేరుగా రూపాయిని ఆయా దేశాల కరెన్సీలతో ఎక్సేంజ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాదు, డిజిటల్‌ కరెన్సీ రూపంలో చెల్లింపులు చేసేందుకు చెకచెకా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇప్పటికే భారత్‌తో సఖ్యతగా ఉన్న దేశాల్లో వ్యాపార లావాదేవీలు డిజిటల్‌ కరెన్సీ రూపంలో ఎక్సేంజ్‌ అవుతున్నది. రష్యాతో చేస్తున్న వ్యాపారంతో పాటు అటు BRICKS దేశాలతో జరుపుతున్న వ్యాపార లావాదేవీలన్నీ రూపాయి మారకద్రవ్యంగానే సాగుతున్నది. ఒక్క ఇండియానే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలన్నీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.

ట్రంప్‌ నిర్ణయాలు

ఇక Trump అధికారంలోకి వచ్చిన తరువాత టారిఫ్‌ల పేరుతో Taxను భారీగా పెంచుతూ వస్తున్నాడు. అమెరికా కాకుండా ఇతర దేశాలు తమ వ్యాపార ఉత్పత్తులను అమెరికాలో అమ్ముకోవాలి అంటే దానికి ఇప్పుడు ఉన్న సుంకాలకు అదనంగా సుంకాలను చెల్లించాల్సిందే. అంటే, ఒక వస్తువు అమెరికాలో 100 రూపాయలకు అమ్మాలి అంటే దానికి ట్యాక్స్‌ కింద ఇప్పుడున్న దానికి డబుల్‌ చెల్లించాలి. ఇలా చేయడం వలన వ్యాపార సంస్థలకు బోలెడు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.

అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతోనే ఇలాంటి సుంకాలను విధిస్తున్నాడు. అమెరికా మొదలుపెట్టిన ఈ ట్రేడ్‌వార్‌ క్రమంగా ప్రపంచదేశాలకు వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా కూడా ట్రేడ్‌ వార్‌ ప్రారంభించింది. అమెరికా వస్తువులపై 25 శాతం ట్యాక్స్‌ విధిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌ చైనానే. ఇందులో భారత్‌ మినహాయింపేమి కాదు. భారత్‌ వస్తువులపై కూడా అమెరికా 100 శాతం టారిఫ్‌ పెంచింది. అంటే ఇప్పుడు కడుతున్న టారిఫ్‌కు డబుల్‌ కట్టాలి.

మేడ్‌ ఇన్‌ ఇండియా

ఇండియా కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తే అమెరికా వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా వాటికి డిమాండ్‌ తగ్గుతుంది. మేక్‌ ఇన్‌ ఇండియా మేడ్‌ ఇన్‌ ఇండియా నినాదం క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా ఏ దేశంలో తయారైన వస్తువులు ఆదేశంలో మాత్రమే వినియోగించుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయనడంలో సందేహం లేదు. ఎక్స్‌పోర్ట్‌తో పాటు ఇంపోర్ట్‌ కూడా తగ్గిపోతుంది. విదేశీ మారకద్రవ్యం కోసం నిల్వలను మెయిన్‌టెయిన్‌ చేయవలసి అవసరం లేదు.

అమెరికా కుదేలు

టెక్నాలజీని ఏదేశానికి ఆ దేశం డెవలప్‌ చేసుకోవడానికి సరైన సమయం ఇదే. ఇలాంటప్పుడు అమెరికాతో అవసరం ఎందుకు వస్తుంది. అమెరికాతో పనిలేకుండా, ఆ దేశానికి వలసలు లేకుంటే ఖచ్చితంగా అమెరికా ఆర్థిక, సాంకేతిక వ్యవస్థ దెబ్బతింటుంది. అమెరికాలో అత్యధికభాగం వలసల నుంచే ఆదాయం లభిస్తుందనడంలో సందేహం లేదు. పైగా ట్రంప్‌ వలస విధానానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఈ ప్రభావం ఆదేశంపై కనిపించకున్నా…ఏనాటికైనా ఇది తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు. అమెరికా దీనస్థితికి చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు.

Read More

North Korea అంతుచిక్కని వ్యూహం

శ్రీకృష్ణుని నవనీత లీల – దైవ తత్వ రహస్యము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *