Native Async

హ్యాపీ బర్త్డే నయనతార: బాలయ్య తో మళ్ళి నటిస్తున్న అందాల భామ…

Balakrishna & Nayanthara Reunite for NBK111; Blockbuster Pair Confirmed Again
Spread the love

బాలకృష్ణ – నయనతార కాంబినేషన్ అంటే పక్కా బ్లాక్‌బస్టర్‌ అని చెప్పొచ్చు. సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ… ఇలా మూడు చిత్రాల్లో ఈ జంట కనిపించి ఫ్యాన్స్‌కి పండగ మూడ్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట స్క్రీన్‌పై కనిపించబోతుండడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపుతోంది.

లేటెస్ట్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాలో మరోసారి NBK కోసం నయన్ ని హీరోయిన్ గా తీసుకొస్తున్నారు. గోపీచంద్ – బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహా రెడ్డి ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. బర్త్డే సందర్బంగా తన ప్రోమో ని కూడా రిలీజ్ చేసారు…

నయనతార పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ అఫీషియల్‌గా ఈ అప్‌డేట్‌ని రిలీజ్ చేస్తూ,
“The Queen who carries the Calm of Oceans and the Fury of Storms… #Nayanthara enters the empire of #NBK111”
అని రాయడంతో సోషల్ మీడియాలో బజ్ మొదలైంది.

బాలకృష్ణ – నయనతార కెమిస్ట్రీ ఎప్పుడూ సూపర్ ఉంటుంది. బాలయ్యతో ఏ సీనియర్‌ హీరోయిన్‌కి బెస్ట్ కెమిస్ట్రీ ఉందని అడిగితే మొట్టమొదట వచ్చే పేరు నయనతారదే.

అదే కాక సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ చేస్తూ,
“ఇది అందరి ఊహలకంటే పెద్దది… చాలా గ్రాండ్‌గా ఉంటుంది”
అని చెప్పడంతో ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్నంటాయి.

వెంకట్ ఎస్ కిలారు ఈ సినిమాను వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నయనతార ఎంట్రీతో NBK111కి మరింత భారీ బజ్ వచ్చిందని చెప్పాలంటే అతిశయోక్తి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit