Native Async

తిరుమల వెళ్లినవారు ఇక్కడ ఒకసారి టేస్ట్‌ చేయండి

Must-Try Food in Tirumala Taste the Srivari Naivedyam Thali Near the Temple
Spread the love

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినవారు వేంగమాంబ అన్నదానం కేంద్రంలో ప్రసాదం స్వీకరిస్తుంటారు. ఎక్కువ మంది భక్తులు ఇక్కడే ఆహారం తీసుకొని, టీటీడీ కాటేజెస్‌లో బసచేస్తుంటారు. అయితే, తిరుమల వెళ్లినవారు డబ్బుల గురించి ఆలోచించేవారు కాకుంటే ఒక్కసారి శ్రీవారి నైవేద్యం అనే రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేయండి. ఇక్కడ సౌత్, నార్త్‌ ఇండియన్‌ తాలి దొరుకుతుంది. శ్రీవారి సన్నిధిలో తయారు చేసే ఆహారం కావడంతో తాలికి ప్రసాదం రుచి వస్తుంది. ఇక్కడ భోజనం చేసిన ఓ ఇన్‌ప్లూయేన్సర్‌ తన అనుభవాలను పంచుకున్నాడు. అతను చెప్పినదాని ప్రకారం తాలి రుచి చాలా బాగుందని, తిరుమల వెళ్లినవారు తప్పకుండా ఒకసారి తాలీ టేస్ట్‌ చేయాలని చెబుతున్నాడు. మరెందుకు ఆలస్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో ఎవరైనా ఫుడ్‌ లవర్స్‌ ఉంటే ఒకసారి ఈ రెస్టారెంట్‌ను దర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit