కంచి అనగానే గుర్తుకు వచ్చే దేవత కామాక్షిదేవి. కంచి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కంచి కామాక్షిని దర్శించుకుంటారు. అయితే, అమ్మవారు ఆలయంలో ఐదు రూపాల్లో దర్శనం ఇస్తారని, ఈ ఐదు రూపాలనే పంచ కామాక్షి రూపాలు అని పిలుస్తారు. ఇందులో మొదటిది శ్రీ స్వయంభూ కామాక్షి రూపం. ఇది ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ రూపం. అమ్మవారు ఆలయంలో స్వయంభూవుగా అవతరించారని అంటారు. మూలవిరాట్ రూపంలోని అమ్మవారు యోగనిద్రలో ఉంటారు. ఇక రెండో రూపం శ్రీ ఊర్ధ్వ కామాక్షీ రూపం. ఓంకారాన్ని సూచిస్తూ తలను పైకెత్తిన రూపంలో కనిపిస్తారు. జ్ఞానం, ఆధ్యాత్మిక లోకారోహణకు సూచికంగా అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ కులకామాక్షిగా మూడో రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇక్కడి అమ్మవారిని శ్రీవిద్యా ఉపాసకుల కులదేవతగా పూజిస్తారు. అమ్మవారిని తంత్ర మార్గంలో పూజించే దేవతగా కొలుస్తారు. శ్రీ శ్రింగేరి కామాక్షి అమ్మవారిగా నాలుగో రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఆదిశంకరాచార్యుల ఆశీర్వాదంతో శ్రింగేరి శారదా పీఠంలో ప్రతిష్టించబడిన రూపాన్ని కామాక్షిదేవిగా ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారిని త్రిపుర సుందరి రూపంగా ఆరాధిస్తారు. శ్రీ విశాలాక్షి కామాక్షిగా ఐదోరూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అమ్మవారు విశాల దృష్టి కలదిగాను, అందరినీ అనుగ్రహించే దేవత రూపంలోనూ ఆరాధిస్తారు. ఈ ఐదు రూపాలను ఎవరైతే దర్శించుకుంటారో వారికి కామకోటి సిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కంచీపురంలో ఒకే చోట అమ్మవారి విభిన్నరూపాలు ఉండటం అరుదైన విషయాల్లో ఒకటిగా పండితులు చెబుతున్నారు.
Related Posts

తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు ఎందుకు తుడుచుకుంటారు?
దేవాలయానికి వెళ్లిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు. తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తరువాత చాలా మంది చేతిని తలకు రాసుకుంటారు. జ్యోతిష్య,…
దేవాలయానికి వెళ్లిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు. తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తరువాత చాలా మంది చేతిని తలకు రాసుకుంటారు. జ్యోతిష్య,…

పరమాచార్య…రమణులు ఒక్కటే… ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని పరమాచార్య అని పెరియస్వామి అని పిలుస్తారు. మన తెలుగు భాషలో చెప్పాలంటే ఆయన నడిచే దైవం. ఎక్కడికైనా సరే ఆయన కాలినడకన వెళ్తూ…
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని పరమాచార్య అని పెరియస్వామి అని పిలుస్తారు. మన తెలుగు భాషలో చెప్పాలంటే ఆయన నడిచే దైవం. ఎక్కడికైనా సరే ఆయన కాలినడకన వెళ్తూ…

కృష్ణ అంగారక చతుర్థశి రోజున సముద్రస్నానం ఎందుకు చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈరోజు విశిష్టత – కృష్ణ అంగారక చతుర్దశి అంటే ఏమిటి? ప్రతి మాసంలో వచ్చే బహుళ పక్ష చతుర్దశి రోజుల్లో, మంగళవారం నాడు చతుర్దశి తిథి వచ్చిన…
ఈరోజు విశిష్టత – కృష్ణ అంగారక చతుర్దశి అంటే ఏమిటి? ప్రతి మాసంలో వచ్చే బహుళ పక్ష చతుర్దశి రోజుల్లో, మంగళవారం నాడు చతుర్దశి తిథి వచ్చిన…