తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
Aadi Sai Kumar’s ‘Shambhala’ Movie Andhra Tour Promotions
Vijayawada ACT Press Meet: Rajahmundry Press Meet: Post Views: 28
Vijayawada ACT Press Meet: Rajahmundry Press Meet: Post Views: 28
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వజ్రం రహస్యం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం. ఇక్కడే గోదావరి నది జన్మస్థానం కూడా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు.…
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం. ఇక్కడే గోదావరి నది జన్మస్థానం కూడా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు.…
మాతృ హృదయానికి అసలైన నిర్వచనం
అమ్మకు మించిన దైవమున్నదా అనే పాట మనందరికీ బాగా తెలుసు కదా. ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే అమ్మకు చెప్పేస్తుంటాం. అమ్మకు తెలిసిన సలహాలు…
అమ్మకు మించిన దైవమున్నదా అనే పాట మనందరికీ బాగా తెలుసు కదా. ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే అమ్మకు చెప్పేస్తుంటాం. అమ్మకు తెలిసిన సలహాలు…