శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు

Swati Nakshatra puja at the Shwetarka Moola Ganapathi Temple in Kazipet

కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్‌చార్జ్‌ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్‌ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *