మెగా ఫామిలీ మీద ట్రోల్ల్స్: లావణ్య త్రిపాఠి గట్టి కౌంటర్…

Lavanya Tripathi Slams Criticism on Chiranjeevi Over Grandson Remarks

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ట్విన్స్ పుట్టిన సందర్భంగా మెగా ఫామిలీ చాల హ్యాపీ హాపీ గా ఉంది… కానీ ఈ హ్యాపీ టైం లో కొందరు సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఇది మెగా ఫాన్స్ ని కూడా ఇబ్బంది పెడుతుంది!

కానీ అందరిలా సైలెంట్ ఉండలేదు వరుణ్ తేజ్ భార్య మెగా కోడలు లావణ్య త్రిపాటి… తాను కూడా గట్టిగా స్పందించింది. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు పుట్టిన నేపథ్యంలో చిరంజీవి కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయిన వేళ… చిరంజీవి గతంలో మనవడు కావాలనే ఆశ వ్యక్తం చేసిన వ్యాఖ్యలను తప్పు గా మర్చి, కొందరు విమర్శలు చేయడం పెద్ద చర్చగా మారింది.

ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాటి సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్) లో స్పందిస్తూ తన ఆవేదనను స్పష్టంగా వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను తాను పట్టించుకోనని చెప్పిన లావణ్య… కానీ ఈసారి మాత్రం కొన్ని వ్యాఖ్యలు తీవ్రంగా నిరాశకు గురి చేశాయని తెలిపారు. ముఖ్యంగా ఒక సినీ విమర్శకుడు కూడా ఈ అంశాన్ని వక్రీకరిస్తూ స్పందించడం తనను బాధించిందని ఆమె పేర్కొన్నారు.

“ఒక కుటుంబంలో పుట్టిన కొత్త ప్రాణం అనేది ఆనందానికి, ప్రేమకు ప్రతీక. అలాంటి మధుర క్షణాలను వివాదాలుగా మార్చడం అనేది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం” అంటూ లావణ్య స్పష్టంగా వ్యాఖ్యానించారు. ఆనందంగా జరుపుకోవాల్సిన సందర్భాలను విషపూరితంగా మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది కేవలం నెగటివిటీని మాత్రమే పెంచుతుందని ఆమె హితవు పలికారు.

చిరంజీవిని విమర్శిస్తున్న వారికి ఆయన కుటుంబాన్ని, ముఖ్యంగా మహిళల పట్ల ఆయన చూపించే గౌరవాన్ని అర్థం చేసుకునే స్థాయి లేదని లావణ్య కుండబద్దలు కొట్టారు. తన మనవరాళ్లతో చిరంజీవి చూపించే ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ గురించి తెలియకుండా మాట్లాడటం సరికాదని ఆమె అన్నారు. “మహిళలను అంత గౌరవంగా చూసే వ్యక్తులు చాలా అరుదు. చిరంజీవి గారు తన కుటుంబంలోని ప్రతి మహిళకు ఇచ్చే విలువను దగ్గరగా చూసినవారికి మాత్రమే అర్థమవుతుంది” అంటూ ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆలోచింపజేశాయి.

Also Read  అల్లు అర్జున్ పై వస్తున్నా వదంతులను ఖండించిన టీం…

అలాగే, వ్యక్తిగతంగా తెలియని వ్యక్తులపై, వారి కుటుంబ జీవితంపై తీర్పులు చెప్పడం సరికాదని లావణ్య స్పష్టం చేశారు. పూర్తిగా అర్థం చేసుకోకుండా, సందర్భం తెలియకుండా వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో తప్పు సందేశాలు వెళ్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె స్పందనలో ఆవేశం కన్నా గౌరవం, బాధ్యత ఎక్కువగా కనిపించడంతో అనేక మంది ఆమెకు మద్దతుగా నిలిచారు.

మొత్తానికి, లావణ్య త్రిపాటి కౌంటర్ ఒక స్పష్టమైన మెసేజ్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *