20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న నాగబంధం టీజర్…

Nagabandham Teaser Out: Virat Karrna’s Divine Warrior Saga Unveiled by Mahesh Babu

అభిషేక్ నామ తన డ్రీమ్ ప్రాజెక్ట్ నాగబంధం నుంచి ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకులను మరింత ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్లు ఇప్పటికే మంచి ముద్ర వేశాయి. ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను కూడా నిన్న శివ రాత్రి సందర్బంగా రిలీజ్ అయ్యింది. ఇంకా ఈ టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేయడం సూపర్ బజ్ తీసుకువచ్చింది!

ఇక స్టోరీ విషయానికి వస్తే, హిమాలయాల లో కాలాన్ని మించిన ఒక రహస్యం దాగి ఉంది. ఒక మనిషి లోభం ఆ రహస్యాన్ని బయటకు తీసుకురావడానికి కారణమవుతుంది. అంతర్గత దుష్ట శక్తులతో పాటు బాహ్య ప్రమాదాలు కూడా రూపం దాల్చుతాయి. ఇంకా అఫ్గాన్ సుల్తాన్ అబ్దాలి రూపంలో సంభవించే ఈ విపత్తు సనాతన ధర్మం ఇంకా హిందూ సంస్కృతికి ముప్పుగా మారుతుంది. ఆల్రెడీ చాల మందిని కర్కశంగా చంపినా ఇతను దైవాన్ని ఎదిరిస్తాడు… కానీ ఇతన్ని చంపడానికి విధి ఇప్పటికే ఒక యోధుడిని ఎన్నుకుంది. ధర్మాన్ని కాపాడేందుకు అతడు వచ్చే ఆసన్నమైంది అనే భావనను టీజర్ ఎంతో శక్తి తో చూపిస్తుంది… ఆ వైబ్రేషన్ గట్టిగా ఉంది కాబట్టే, ఇప్పటికే ఈ టీజర్ 20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది!

దర్శకుడు అభిషేక్ నామ తన దృష్టిని ప్రతి ఫ్రేమ్‌లో జీవింపజేశారు. అద్భుతమైన విజువల్స్, ఆధ్యాత్మిక భావనలతో నిండిన కథనం అన్ని కలిసి ఒక గొప్ప మాగ్నమ్ ఓపస్ అనుభూతిని అందిస్తున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా, ప్రతి షాట్ ఎంతో ఎమోషన్ ఇంకా ఉత్కంఠను వ్యక్తం చేస్తోంది. ఇది సినిమా స్థాయిని ముందుగానే తెలియజేసే సంకేతంగా కనిపిస్తోంది.

విరాట్ కర్ణ స్క్రీన్‌పై శివుడి గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇది టీజర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. ఈ గ్లింప్స్ ద్వారా నభా నటేష్, ఇష్వర్యా మీనన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, రిషభ్ సావ్నే, గరుడ రామ్ తదితర ప్రధాన నటీనటులను కూడా పరిచయం చేశారు. ప్రతి పాత్ర కథలో కీలకమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉండబోతుందనే సంకేతం స్పష్టంగా తెలుస్తోంది.

Also Read  పవన్ కళ్యాణ్ తో నేను సినిమా చెయ్యట్లేదు అన్న అనిల్ రావిపూడి…

సౌందర్ రాజన్ ఎస్ అందించిన విజువల్స్ అద్భుతంగా మెరిసిపోతుండగా, జునైద్ కుమార్ సమకూర్చిన భక్తి రసంతో నిండిన నేపథ్య సంగీతం వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. అశోక్ కుమార్ రూపొందించిన మిస్టికల్ ప్రొడక్షన్ డిజైన్, అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు అన్ని కలిసి సినిమాకు అపూర్వమైన వైభవాన్ని అందిస్తున్నాయి. నిర్మాతలు కిషోర్ అన్నపూరెడ్డి మరియు నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తూ ప్రతి ఫ్రేమ్‌ను భక్తి, విధ్వంసం, వైభవం కలిసిన కళాఖండంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ వేసవిలో ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చింది. దైవత్వం లేచే క్షణం, చీకటి వెనక్కు తగ్గే వేళ, విధి గర్జించే సమయం—అన్నీ ఒకే కథలో కలిసే ఆ మహా అనుభూతిని నాగబంధం ప్రేక్షకులకు అందించబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *