రాజమౌళి ప్లానింగ్ ఏ ప్లానింగ్…

“Why SS Rajamouli Locked April 7, 2027 for Varanasi – A Masterstroke in Movie Promotion

వారణాసి… ఇప్పుడు ఈ సినిమా గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. మొన్నే కదా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అది కూడా 7th ఏప్రిల్ 2027 … ఎక్కడైనా మొదట ఏ ప్రెస్ మీట్ లోనో, లేకపోతె సోషల్ మీడియా లో రిలీజ్ డేట్ రివీల్ చేస్తారు. కానీ ఇక్కడ జక్కన్న… నా దారి రహదారి అని చెప్పకనే చెప్పి, వారణాసి అదే కాశి లో హైవే హోర్డింగ్ మీద 7th ఏప్రిల్ 2027 అని పోస్టర్స్ వేయించాడు… సినిమా పేరు లేదు… యాక్టర్స్ పేరు అంతకన్నా లేదు. కానీ ఈ రిలీజ్ డేట్ వారణాసి మూవీ దే అని అందరు ఫిక్స్ అయ్యేలా చేసాడు. ఈ ప్లానింగ్ చాలదు, వారణాసి సినిమా ప్రొమోషన్స్ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడానికి…

ఇక ఈ డేట్ నే రాజమౌళి ఎందుకు ఫిక్స్ చేసాడు… ఏడాది కన్నా ముందే ఎందుకు ఈ డేట్ పై కర్చీఫ్ వేసాడు అన్న డౌట్స్ అందరికి వచ్చే ఉంటాయి కదా… అందుకే దీని సమాధానం తో మీ ముందుకు వచ్చాము.

ఏప్రిల్ 7th మన తెలుగు వాళ్ళ ఉగాది పండగ… ఉగాది పండగ అంటే మన తెలుగు సంవత్సరం మొదటి రోజు కదా. అలాగే ఆ రోజు గుడి పడ్వా కూడా జరుపుకుంటారు నార్త్ లో… సో, ఇంత విశిష్టమైన రోజు కాబట్టే, ఈ డేట్ ని ఫిక్స్ చేసాడు జక్కన్న. అలాగే నార్మల్ గా సినిమాలు గురువారం లేదా శుక్రవారం రిలీజ్ అవుతాయి… కానీ వారణాసి బుధవారం రిలీజ్ అవుతుంది. సో, ఫస్ట్ రెండు రోజులు ఎలాగో బజ్ ఉంటుంది, ఇంకా ప్రీ-రిలీజ్ హుంగామ ఉంటుంది కాబట్టి, టికెట్స్ బుక్ అవుతాయి ఇంకా ఫాన్స్ కూడా ఫస్ట్ రెండు రోజులు సినిమా చూస్తారు అది హాలిడే ఐన కాకపోయినా… ఇక నెక్స్ట్ వీకెండ్ సో, ఇలా సినిమా కి ఫస్ట్ నాలుగు రోజులు కలిసి వస్తాయి. సో, నెక్స్ట్ 15th ఏప్రిల్ న శ్రీ రామ నవమి… ఇంకా ముందు రోజు అంబెడ్కర్ జయంతి… ఇలా నెక్స్ట్ వీక్ కూడా సాలిడ్ హాలిడేస్. ఇంకా పైగా సమ్మర్ వకాషన్ టైం. సో, ఇలా కరెక్ట్ డేట్ ని బుక్ చేసాడు రాజమౌళి.

Also Read  ప్రేక్షక దేవుళ్ళకి నా ధన్యవాదాలు అంటూ తన కృతజ్ఞత తెలిపిన చిరంజీవి…

ఇక ఈ సినిమా లో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడని తెలిసిందే. సో, ఉగాది రోజు రాముడు సీత దేవి తో కలిసి అయోధ్య లో తిరిగి అడుగుపెట్టాడని తెలిసిందే. ఇక నెక్స్ట్ శ్రీ రామ నవమి! ఇదే కాకుండా, ఉగాది రోజు బ్రహ్మ సృష్టిని సృష్టించాడని కూడా అంటారు కదా! సో, ఇలా అన్ని కలిసి వచ్చే డేట్ ఇదే. అమ్మ రాజమౌళి ఇంతలా ఆలోచించాడు అని అందరు ముక్కున వేలు వేసుకోవడం గ్యారంటీ!

ఈ సినిమా లో మహేష్ బాబు రుద్రా గా ఒక globaltrotter గా ఇంకా రాముడిగా కనిపించనున్నాడు. ఆయనకి జోడి గా హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఈ సినిమాలో మందాకినీ గా కనిపించనుంది! ఇక విలన్ ఐతే ప్రిథ్వీరాజ్ సుకుమారన్… ఈ versatile నటుడు కుంభ గా కనిపించనున్నాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *